విశాఖ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కొన్ని గ్రామాల ప్రజలని ప్రాణాపాయ స్థితికి నెట్టింది ఈ ఘటన. అయితే ఈ ఘటనలో ఏకంగా 12 మంది ప్రాణాలను సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలను సీరియస్గా తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ... బాధితులకు పరిహారం నుంచి కంపెనీ నిర్వహణ వరకూ అన్నింటిపై సత్వర చర్యలు చేపడుతూ  కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇప్పటికే ఈ దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల పరిహారం అందిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది  జగన్ సర్కారు. 

 

 

 అయితే ఈ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మరణించిన 12మందికి మిగిలిన బాధితులకు  అందరికీ ఈ పరిహారాన్ని తమ తమ అకౌంట్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా బాధితులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారూ సీఎం జగన్ . ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండం  ఎంతో బాధాకరమైన విషయం అంటు  విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనేది గత ప్రభుత్వాల సమయంలో తాను చేశానని...  2014 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జిసి గ్యాస్ లీకై ఒక గ్రామం మొత్తం తగలబడి పోగా 22 మంది సజీవ దహనమయ్యారని... ఆ సమయంలో బాధిత గ్రామానికి వెళ్లినా తాను... అలాంటి ఇన్సిడెంట్ లు జరిగినప్పుడు ఎలా స్పందించాలి  అన్నది అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.

 

 

 అందుకే బాధితులకు ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే... కంపెనీల విషయంలో కఠిన తీసుకోవాల్సిందే  అంటూ తెలిపారు. ఇక ఎల్జి పాలిమర్స్ కంపెనీని  కూడా విశాఖ నుంచి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అందరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: