ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఎంతో మంది ఆకలి చావులకు కారణం అవుతుంది.  కరోనా కట్టడి చేయడానికి మార్చి నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో కరోనా ఇంకా కంట్రోల్ కావడం లేదని లాక్ డౌన్ పెంచుకుంటూ పోతున్నారు.  ప్రస్తుతం 4.0 లాక్ డౌన్ నడుస్తుంది.. ఈ నెల 31 వరకు పొడిగించడం జరిగింది.  అయితే వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల పరిస్థితి వర్ణణాతీతంగా మారిపోయింది.  ఎవ్వరికీ చెప్పుకోలేక.. ఆర్థికంగా కృంగిపోయి.. చివరికి తమ బిడ్డలకు అన్నం పెట్టలేని దయనీయ పరిస్థితి నెలకొంటుంది.    రోజు తాము సంపాదించిన సంపాదనలో తన బిడ్డల కడపు నింపుతూ.. అమ్మా ఆకలి అనగానే తాను తినేది ఆపి తన బిడ్డలకు తినిపిస్తూ వచ్చింది ఆ తల్లి.  కానీ లాక్‌డౌన్ ఆమె కుటుంబాన్ని ఛిద్రం చేసింది.

 

పనుల్లేక పిల్లలు ఆకలితో అల్లాడిపోయారు. నాలుగు రోజులుగా తిండి లేక నాలుగేళ్ల కూతురు ప్రాణం విడిచింది.  జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దళితవర్గానికి చెందిన కళావతి భర్త జగ్గాల్ భుయాల్ వలస కార్మికుడు. సొంతూరులో కాకుండా వేరే ఊరిలో ఇటుకల బట్టీలో పనిచేస్తున్నాడు. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయిన విషయం తెలిసిందే. దాంతో బట్టీని మూసేయడంతో పని లేకుండా పోయింది. భుయాల్ అక్కడే చిక్కుకుపోయాడు. అతనికి 8 మంది పిల్లలు.

 

కళావతి వాళ్లనూ వీళ్లను అడిగి కొంత పిండి, బియ్యం సేకరించి, అప్పులు చేసి పిల్లలకు పెడుతూ వస్తోంది.  జన్ ధన్ ఖాతా కింద రూ. 500 డబ్బులు, అంగన్ వాడీ వాళ్లు ఇచ్చిన చారెడు బియ్యం తప్ప ప్రభుత్వం నుంచి మరే సాయమూ అందలేదు.రేషన్ కార్డు కూడా లేకపోవడంతో  ధాన్యం దొరక్క పిల్లలను నీళ్లు తాగించి పడుకోబెడుతోంది. నాలుగు రోజులుగా తిండి లేక నాలుగేళ్ల కూతురు ప్రాణం విడిచింది. లాక్ డౌన్ లేకపోయింటే పిల్లలు స్కూలు వెళ్లి మధ్యాహ్న భోజనం తినేవారని, ఇప్పుడదీ లేకపోవడంతో పస్తులు ఉంటున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: