గత మూడు నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రధానంగా వలస కార్మికుల గురించి చర్చ జరుగుతోంది. వలస కార్మికుల కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. వలస కార్మికులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికులు ప్రధానంగా రోడ్లు, నిర్మాణ రంగంలో పని చేస్తూ ఉంటారు. వలస కార్మికులకు నిబంధనల ప్రకారం ఒక సంక్షేమ నిధి ద్వారా నగదు సహాయం అందజేస్తే వారికి ప్రయోజనం చేకూరుతుంది. 
 
కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమ నిధి ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయదు. ఆ సంక్షేమ నిధిని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం వాడుకుంటూ ఉంటాయి. వలస కూలీలలో ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో పని చేసే వ్యవసాయ కూలీలు ఉంటారు. వారి తరలింపు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆలస్యమవుతోంది. కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతున్నా చాలామంది వలస కార్మికులు సొంతూళ్లకు చేరుకోవడానికి వేరే మార్గం లేక నడుచుకుంటూ వెళుతున్నారు. 
 
కేంద్రం వలస కార్మికుల భోజనాల కొరకు, ఆశ్రయం కొరకు రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తోంది. ఆ నిధులకు సంబంధించిన లెక్కల గురించి వాస్తవాలు ఎవరూ చెప్పరు. వలస కార్మికులు ఉపాధి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వీళ్లకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపించట్లేదు. శ్రామిక్ రైళ్లు వచ్చి 15 రోజులైనా వలస కార్మికులు ఇబ్బందుల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 
 
మరోవైపు వలస కార్మికుల గురించి ప్రచారమవుతున్న వార్తలు వారిని భయాందోళనకు గురి చేస్తూ ఉండటం కూడా వాళ్లు సొంతూళ్ల వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడానికి కారణమవుతోంది. పలు ప్రాంతాల్లో వలస కార్మికుల విషయంలో పార్టీల నిర్లక్ష్యం వల్ల వైరస్ పలు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు కారణం వలస కార్మికులే అవుతూ ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చిన్నచిన్న పొరపాట్లే కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు వలస కార్మికుల విషయంలో ఇస్తున్న హామీలు, ప్యాకేజీలు మాటలకే పరిమితమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: