చాలా దురుసుగా మరియు ప్రత్యర్థులకు చాలా ఘాటుగా రిప్లై ఇవ్వటం లో వైసీపీ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ కి మించిన వారు మరొకరు ఉండరు. అసెంబ్లీలో అయినా ఎవరినీ లెక్క చేయకుండా అనిల్ కుమార్ యాదవ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అనిల్ కుమార్ యాదవ్ వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక నీటి పారుదల శాఖ మంత్రి గా ప్రస్తుతం రాణిస్తున్నారు. ఇటువంటి సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ని ఇబ్బంది పెట్టే దిశగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుపై అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతూన్నట్లు పలువురు విమర్శలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 వేల కోట్ల అంచనాలతో నిర్మాణం కావాల్సి ఉండగా చంద్రబాబు అధికారంలో 16 వేల 800 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అనగా 35 శాతం పనులు టీడీపీ హయాంలో జరిగాయి.

 

అయితే ఈ సమయంలో మాజీ మంత్రి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలుగుదేశం పార్టీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 48,000 కోట్ల అంచనాలో అందులో కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు 16,010.45 కోట్లు… మిగతాదంతా పునరావాసానికి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ ఖర్చు భారీగా ఉంటుంది. దేవినేని ఉమా చెప్పిన లెక్కల ప్రకారం తెలుగుదేశం చెప్పే 70 శాతం పూర్తి అనేది ప్రాజెక్టు నిర్మాణమే. ఈ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ సరైన లెక్కలు చెప్పకుండా ఉద్దేశపూర్వకంగా టిడిపి పనులను పక్కన పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

చాలావరకు అనిల్ కుమార్ యాదవ్ తెలియకపోవడం వల్ల నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో మంత్రి ఈ విధంగా మాట్లాడితే ఎలా అని అంటున్నారు. సరైన లెక్కలు కూడా తెలియని అనిల్ కుమార్ యాదవ్ ని నీటి పారుదల శాఖ మంత్రిగా జగన్ నియమించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని టిడిపి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: