దేశ రాజకీయాలలో తనకంటే సీనియర్ నాయకుడు ఎవ్వరూ లేరని, అపార మేధావి అని తనకు అనుకూలంగా ఉండే మీడియా ద్వారా తెగ డప్పు కొట్టిచ్చుకుంటారు చంద్రబాబు. అయితే తాజాగా సోషల్ మీడియా రావడంతో ఎక్కడికక్కడ వాస్తవాలు బయటపడటంతో బాబోరు మీడియా ఎంత డప్పు కోట్టిన జనాలు చైతన్యం కావడంతో పెద్దగా పట్టించుకోవటం లేదు. క్షణాలలో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, అది ఎందుకు జరిగింది ?, ఎలా జరిగింది ? అన్న వాస్తవాలు బయటపడటంతో చంద్రబాబు గురించి మీడియా ఎంత చెప్పినా గానీ వినే స్థితిలో ప్రస్తుతం ఉన్న ప్రజలు లేరు. దీంతో ఆయనకు ఉన్న బిరుదులు ఇప్పుడు ప్రజలలో పలచబడి పోతున్నాయి. చంద్రబాబు లో ఉన్న రాజకీయం మొత్తం ప్రజల ముందు బహిర్గతమవుతుంది.

 

దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ వేగాన్ని చంద్రబాబు అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి ఎక్కడా కూడా ప్రతిపక్షానికి టైమింగ్ ఇవ్వకుండా జగన్ ఎక్కడికక్కడ సొల్యూషన్స్ ఇచ్చేయడంతో ప్రతిపక్ష పార్టీ టిడిపి పరిస్థితి ఆటలో అరటిపండు లాగా మిగిలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య అయినా తన దృష్టిలో కి వచ్చిన వెంటనే అతి తక్కువ సమయంలోనే పరిష్కారం చూపే విధంగా తన టీం సెట్ చేసుకున్నారు జగన్. దీంతో సమస్య దగ్గరికి టిడిపి నాయకులు వెళ్లే లోపే అధికార పార్టీ వాళ్ళు పరిష్కారం చూపటం తో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

 

ఇదే సమయంలో కరోనా వైరస్ విషయంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న చొరవలు జగన్ తీసుకోవడంతో జగన్ పేరు జాతీయస్థాయిలో మారుమ్రోగుతోంది. వలస కూలీల విషయంలో వాళ్లకి ఆహారం విషయంలో మరియు గమ్యస్థానాలకు చేర్చే విషయంలో జగన్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో జగన్ కి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకుముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పేరు వినపడగా, ఇప్పుడు జగన్ క్రేజ్ ముందు బాబు పలచబడి పోయారు. ఎక్కడ చూసినా జగన్ పేరే. జాతీయ నాయకుల దగ్గర మరియు జాతీయ మీడియాలో జగన్ పేరు మారు మ్రోగుతున్న నేపథ్యంలో బాబుని మర్చిపోయే పరిస్థితి అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్రాలలోనూ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: