ఎప్పటికైనా రెండు పడవలపై ప్రయాణం ప్రమాదమే అని పెద్దలు అంటుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగు రాజకీయాల్లో నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీలు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో కీలక పాయింట్ లో జగన్ ఇరికించినట్లు అయింది. పోతిరెడ్డిపాడు నీటి ప్రాజెక్టు సామర్థ్యం పెంచే విషయంలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇద్దరు మాట్లాడలేని పరిస్థితి లోకి జగన్ నెట్టేశాడు. ఎలా మాట్లాడినా ఈ విషయంలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాల విషయంలో మరోచోట పార్టీని చంపేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటువంటి సమయంలో రాయలసీమ ప్రాంతం నుండి పవన్ కళ్యాణ్ పై మరియు చంద్రబాబు పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

 

ఎన్నికల సమయంలో మరియు మరికొన్నిసార్లు రాయలసీమ ప్రాంతం లోకి వచ్చి ఇద్దరు నాయకులు రాయలసీమని రతనాల సీమ చేస్తామని మాట్లాడారు.  అటువంటిది సీమ ప్రాంతానికి ఎంతో మేలు చేసే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఈ విషయంలో నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమను కరువు సీమగా మార్చేందుకు రాజకీయ నాయకులు అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఈ కరువు సీమలో పంటలు పండేలా జగన్ నిర్ణయం తీసుకుంటే దానికి ఎందుకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

 

ఇదే సమయంలో చంద్రబాబు ని కూడా ఏకిపారేస్తున్నారు. సొంత జిల్లా చిత్తూరు కి కూడా ఈ ప్రాజెక్టు వల్ల నీరు వస్తుందంటే చంద్రబాబు మాట్లాడకపోవడం నిజంగా దౌర్భాగ్యమని రాయలసీమ ప్రజలు అంటున్నారు. ఇద్దరికిద్దరూ పొలిటికల్ పార్ట్నర్స్ అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడు కి మరియు పవన్ కళ్యాణ్ కి రాయలసీమలో పుట్టగతులు లేకుండా జగన్ తన అద్భుతమైన రాజకీయంతో ఇరికించారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: