దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు తీసుకు వస్తూ చరిత్ర సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని సంస్కరణలను అమలులోకి చేస్తూ తద్వారా వచ్చిన ఆదాయంతో దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చేయడం.. సమర్థవంతంగా జీఎస్టీ ఆదాయం రావటం...  ఆర్టికల్ 370 రద్దు చేయడం ఇలా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు సంస్కరణలు తీసుకు వచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ దేశప్రజల ప్రజల సంక్షేమం కోసం ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి సంచలనం సృష్టించారు. 

 


 అయితే ఇప్పటికే ఎన్నో సంచలన సంస్కరణలు తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తాజా వార్తలు ఆత్మ నిర్బర్ భారత్ అనే కొత్త సంస్కరణలు తీసుకు వచ్చారు. ఇక ఈ సంస్కరణను తీసుకొచ్చి తన రాజకీయ భవిష్యత్తుపై ఒక పరీక్ష పెట్టుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో అన్నీ ఉచితంగా ఇస్తారు అని అందరూ అనుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎంతో భిన్నంగా ఆలోచించింది. అన్నీ ఉచితంగా ఇచ్చి  ప్రజలను సోమరులుగా చేయకుండా... ప్రజలు ఎవరికి వారు కష్టపడి తమ ఆహారాన్ని తాము  సంపాదించుకునే విధంగా ఆత్మ నిర్బర్  భారత్ ద్వారా పలు మార్గదర్శకాలను సిద్ధం చేసింది మోడీ సర్కార్. 

 


 అటు ప్రపంచ బ్యాంకు సైతం ఈ ఆత్మ నిర్బర్  భారత్ ని సమర్థిస్తూ సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ప్యాకేజీలో వ్యవసాయ రంగానికి ఎక్కువ పెద్దపీట వేశారు నరేంద్రమోదీ. వ్యవసాయ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు... కేటాయించారు. అయితే  ఒక్క సారిగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతో అన్నీ ఉచితంగా వస్తాయని ప్రజలు ఉచితంగా కానీ నరేంద్ర మోడీ మాత్రం ఇవ్వాల్సిన వారికి కొన్ని నిధులు  కల్పించి దేశ అభివృద్ధి కోసం.. అందరికీ ఉద్యోగాలు కల్పించే విధంగా నిధులు  కేటాయించడంతో ఇప్పుడు ఆత్మనిర్బర్  భారత్ పై పలు విమర్శలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: