ప్రపంచంలో కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ కి కారణం చైనా అని ప్రపంచదేశాలన్నీ ఏకమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అగ్రరాజ్యాలు మరియు డబ్బు ఉన్న దేశాలు చైనా దేశంలో తమ దేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టిన వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఆదేశాలు ఇస్తున్నాయి. దీంతో చాలావరకు చైనా దేశంలో పెట్టుబడులు ఇతర దేశాలకు చెందినవి మెల్ల మెల్లగా బయటకు వచ్చేస్తున్నాయి. మరోపక్క అమెరికా బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు కరోనా వైరస్ అసలు ప్రపంచంలో కి ఎలా వచ్చిందో అన్న దానిపై విచారణ జరిగిన చాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

అయితే ఈ విషయంలో మాత్రం చైనా కి ముందు నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుగా నిలబడుతోంది. కావాలనే ఈ వైరస్ చైనా సృష్టించలేదని చైనా దేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకొస్తుంది. అయితే ఈ విషయంలో మోడీ త్వరలో తండ్రి కాబోతునట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అది ఎలా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా జపాన్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ స్థానంలోకి నెక్స్ట్ దక్షిణాసియా నుంచి ఇండియాకు అవకాశం దక్కే చాన్సు ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే ఇండియాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ విషయంలో ప్రస్తుతం బోర్డు చైర్మన్ వైరస్ విషయంలో చైనా కి సపోర్ట్ చేస్తూ ఉండగా… ఇండియా ఎంటర్ అయితే మాత్రం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు సపోర్టు చేసే అవకాశాలున్నాయని మరోపక్క టాక్ గట్టిగా వినబడుతుంది.

 

కాగా మోడీ ఇప్పటికే ఆ పదవికి సంబంధించి కీలకమైన వ్యక్తి ని సెలెక్ట్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ సభ్యులకు మరియు చైనాకి దిమ్మతిరిగిపోయే విధంగా ప్లాన్ వేసినట్లు సమాచారం. త్వరలోనే భారత్ చైర్మన్ గా డబ్ల్యూ.హెచ్.ఓ ఎగ్జి క్యూటీవ్ బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో 194 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులు  పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా స్పందించాలని అమెరికా సహా మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని చైనా దేశమే ఈ వైరస్ నీ ల్యాబ్ నుండి కావాలని పుట్టిందని బయట పెట్టడానికి మోడీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విధంగానే స్పందించారు. చైనా ల్యాబ్ నుండి కరోనా వైరస్ పుట్టిందని మొన్న వ్యాఖ్యలు చేశారు . మొత్తం మీద ప్రపంచం నడిబొడ్డున మోడీ సరైన వ్యక్తి ద్వారా కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు బయట పెట్టడానికి రెడీ అవుతున్నట్లు అర్థం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: