కరోనా ప్రపంచాన్ని అతాల కుతలం చేసిన సంగతి తెలిసిందే.. ఎన్నో లక్షల మంది కరోనా బారిన పడి చనిపోయిన సంగతి విదితమే.. ఇకపోతే లాక్ డౌన్ పేరుతో ప్రజలను ప్రభుత్వం ఇళ్లకే కట్టిపడేసింది.. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల జీవితాలు మాత్రం దయనీయంగా మారాయి.. వారి ఆకలిని తీర్చుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. ఎన్నో స్వచ్చంధ సంస్థలు కూడా తమ వంతు సాయన్నీ ప్రకటిస్తూ వస్తున్నారు.. 

 

 

కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. ఎటు చూసినా కూడా జిల్లాల వారీగా భారీగా పెరుగుతూ వస్తుంది..

 

 


తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ తోసహా అన్ని ప్రాంతాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో రోజు విడిచి రోజు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసారు ముఖ్యమంత్రి. కొన్ని నియమాలను ఆయా పాసింజర్స్ లేదా డ్రైవర్స్ పాటించాలని కోరారు.. కరోనా ప్రభావం తెలంగాణలో తగ్గడం మూలంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

 


మంగళవారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయన్నారు. సిటీ బస్సులకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదన్నారు.
అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇక హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు తిరుగుతాయని.. ఐతే డ్రైవర్‌తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఇక తెలంగాణలో మంచి రోజులు మొదలయ్యాయని డ్రైవర్లు కండక్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: