భారత్ లో ఇప్పటివరకు మూడు లాక్ డౌన్ లు ముగిసిన కూడా కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగింది. ఇప్పటివరకు దేశం లో కరోనా కేసుల సంఖ్య  లక్ష దాటింది. గత కొన్ని రోజుల నుండి చాలా రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా  4700కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 2033, గుజరాత్ లో366 తమిళనాడులో 536 కేసులు నమోదయ్యాయి. 
 
ఓవరాల్ గా నిన్నటి వరకు ఇండియాలో100161కరోనా కేసులు నమోదుకాగా అందులో38909 మంది బాధితులు కోలుకోగా 3144మంది మరణించారు. ప్రస్తుతం 58102 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇక నిన్నటి నుండి  దేశ వ్యాప్తంగా నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది. మే 31 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉండనుంది అయితే పేరుకే లాక్ డౌన్ అన్నట్లు గాని కేంద్రం దాదాపు అన్ని రకాల మినహాయింపులు ఇచ్చింది. విమానాలు , రైళ్ల రాకపోకలు అలాగే విద్యాసంస్థలు ఇలా కొన్నింటి ఫై  మాత్రం నిషేధం విధించింది.
 
కరోనా ప్రభావం వున్నా కూడా చాలా రాష్ట్రాలు ఆర్థిక సమస్యల వల్ల కేంద్రం ఇచ్చిన మినహాయింపులను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ లో ఒక్క కంటైన్మెంట్ జోన్లలో తప్ప ఈ రోజు నుండి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్రం ఇచ్చిన మినహాయింపులను కొనసాగించనున్నారు. ఇక ఈనెల31వరకు కరోనా ప్రభావం తగ్గకున్నా కేంద్రం పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఇండియాలో కరోనా ప్రారంభం కాకముందే ఆర్థిక మాద్యం కొనసాగుతుండగా  కరోనా వచ్చి దేశాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: