ప్రజలను ఎలా శాసించా....లో అధికారాన్ని పూర్తిస్థాయిలో ఎలా వినియోగించుకోవాలో ప్రపంచదేశాలకు నేర్పిన దేశం ది గ్రేట్ బ్రిటన్ అలియాస్ ఇంగ్లాండ్ ఇప్పుడు అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దశాబ్దాల క్రితం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిన బ్రిటన్ ప్రపంచ రాజకీయాలను విధంగా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదంతా చరిత్ర. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఒక సాదాసీదా దేశం. కరోనా దయ వల్ల దాని పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. పేరుకే అగ్రదేశం... ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను కాదు కదా తన సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని పరిస్థితి.

 

అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటిన వేళనే బ్రిటన్ ఒక్క స్థానం అంతర్జాతీయ యవనికపై ఒక నామమాత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారి అయితే దేశాన్ని కుదిపేసింది. నెల 3 తేదీ నాటికి దేశంలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. 30 వేల మంది ఇప్పటికే కన్నుమూశారు. ఏకంగా దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుండి తప్పించుకుని కొద్దిలో బయటపడ్డాడు అంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

 

కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రక్రియలో భాగంగా విధించిన లాక్ డౌన్ తో ప్రజలు పెద్దమెుత్తంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఆతిధ్యం, సేవా, రిటైల్ రవాణా రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కనుమరుగవుతుండటంతో పేదరికం ముప్ప ప్రమాదం పొంచి ఉంది. సామాజిక, స్వచ్ఛంద సంస్ధ అయిన జోసెఫ్ రౌన్ ట్రీ ఫౌడేషన్ ఆర్ధికం విభాగం అధినేత వే ఇన్స్ విషయాన్ని వెల్లడించారు.

 

అటువైపు మిగతా ప్రపంచ దేశాలు మరియు చిన్న చిన్న దేశాలు లాక్ డౌన్ ను సరైన ప్లాన్ తో వైరస్ కంట్రోల్ చేస్తూ అటు ఆర్థిక వ్యవస్థని కూడా కాపాడుకుంటే బ్రిటన్ మాత్రం రెండిట్లో చతికిలపడింది. కరోనా వైరస్ సోకితే దాదాపు 80 శాతం పైన రికవరీ రేటు ఉంటుంది. 70 ఏళ్లకు పైబడిన వారి ప్రాణాలకు మాత్రమే రిస్క్ అయితే విషయంలో కొద్దిగా అతి జాగ్రత్త పడిన ఇంగ్లాండ్ చివరికి వైఫల్యానికి తగ్గ మూల్యం చెల్లించుకుంది. లాక్ డౌన్ ను పటిష్టంగా మరియు కఠినంగా అమలు చేసి దేశం మొత్తాన్ని ఆర్థిక సంక్షోభం లోకి నెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: