ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సర్కారు నిర్ణయాలకు హైకోర్టు అడ్డుకట్ట వేయడం రివాజుగా మారింది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం వంటి అనేక అంశాల్లో జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతూ తీర్పులు ఇచ్చింది. అందుకే ఏపీలో ప్రతిపక్షం, ఇతర నాయకులు ఇప్పుడు హైకోర్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. కోర్టుకు వచ్చిన కేసుల విషయంలోనే కాదు.. కోర్టుకు వచ్చే లేఖలో విషయంలో కూడా ఏపీ హైకోర్టు చురుకుగానే స్పందిస్తోంది.

 

 

తాజాగా... విశాఖపట్నంలో 3 రోజుల క్రితం సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం కూడా ఇప్పుడు కోర్టుకు ఎక్కింది. దీనిపై ఎవకూ కేసు పెట్టకపోయినా.. టీడీపీ నేత వంగలపూడి అనిత రాసిన లేఖను కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ సుధాకర్ ఘటన విషయంలో అసలు ఏమి జరిగిందో వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించింది. డాక్టర్ సుధాకర్ ను హాజరుపర్చాలని కేసును విచారణకు స్వీకరించి బుధవారానికి వాయిదా వేసింది.

 

 

డాక్టర్ సుధాకర్ విషయంలో... ఆయన తప్పతాగి బండబూతులు తిడుతూ నానా గొడవ చేశారని పోలీసులు అంటున్నారు. అయితే డాక్టర్ సుధాకర్ వ్యవహరించిన తీరును అందరూ తప్పుబడుతున్నా... ఆయన చేతులు వెనక్కి కట్టేయడం, ఆయన్ను కొట్టడం, ఓ ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించడం వంటి అంశాల్లో పోలీసులు అతిగా వ్యవహరించారన్న వాదనలు వినిపించాయి.

 

 

ఇప్పుడు ఇదే కోణంలో ఏపీ హైకోర్టు కూడా విచారణ సాగించే అవకాశం ఉంది. ఇటీవల హైకోర్టు నుంచి వస్తున్న కోర్టు తీర్పుల సరళి చూస్తుంటే.. ఈ విషయంలోనూ జగన్ సర్కారుకు అక్షింతలు తప్పవేమో అన్న వాదన వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: