ప్రపంచ ఆర్ధిక రంగం కుదేలులవుతుంది.. ఇప్పటికే అన్ని దేశాలను వణిస్తున్న కరోనా వైరస్ మూలంగా ఎన్నడు చవిచూడని కష్టాలను చూస్తున్న దేశాల పరిస్దితి చిల్లులు పడిన నావలా మారింది.. మరికొన్ని దేశాల పరిస్దితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడి ప్రజలకు సరైన ఆరోగ్యం, కనీస అవసరాలు అందించలేని స్దితిలో మగ్గుతున్నాయి.. ఇకపోతే నష్టాలకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేని బ్యాంక్, సాఫ్ట్‌ బ్యాంక్‌.. ఈ జపాన్ టెక్నాలజీ దిగ్గజం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 961.6 బిలియన్‌ యెన్‌, అంటే దాదాపు రూ.68000 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఆర్ధిక సంవత్సరంలో కార్యాలయ స్థల షేరింగ్‌ సంస్థ వీవర్క్‌ సహా పలు విజన్‌ ఫండ్‌ పెట్టుబడులు భారీగా విలువను కోల్పోవడమే ఇందుకు కారణం అని పేర్కొంటున్నారు...

 

 

ఇదిలా ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌బ్యాంక్‌ 1.4 లక్షల కోట్ల యెన్‌ల భారీ లాభాన్ని ఆర్జించిందట. వీటి అమ్మకాలు కూడా 6.2 లక్షల కోట్ల యెన్‌లకు పెరిగాయని, కానీ ప్రస్తుత పరిస్దితుల్లో అంచనాలు తలకిందులయ్యాయని ఈ కంపెనీ ప్రతినిధులు పేర్కొనగా.. కంపెనీ స్థాపించిన 39 ఏళ్లలో ఇవే అత్యంత అధ్వాన ఫలితాలని విశ్లేషకులు వివరిస్తున్నారు... ఇలాంటి సమయంలో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఎటువంటి అంచనాలను వెల్లడించలేదు.

 

 

ఇకపోతే వీవర్క్‌తో పాటు ఉబర్‌, ఇతర సంస్థల్లో కంపెనీ పెట్టిన పెట్టుబడుల విలువ భారీగా తగ్గగా, అనుకోకుండా ముంచు కొచ్చిన కరోనా వైరస్‌ వల్ల ఈ సంక్షోభం పెద్దదిగా మారిందట. ఇక అమెరికాలో టి-మొబైల్‌లో స్ప్రింట్‌ విలీనం ఒక్కటే సానుకూలాంశం.. ఇదిలా ఉండగా అలీబాబా అధిపతి జాక్‌ మా, నష్టాల్లో కూరుకుపోయిన సాఫ్ట్‌ బ్యాంక్‌ బోర్డు నుంచి వైదొలిగారు. ఈయన కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించడానికి ముందే తన రాజీనామా ప్రకటించారు. కానీ తన రాజీనామాకు గల కారణాలను మాత్రం జాక్‌ మా వెల్లడించలేదు.

 

 

ఏది ఏమైనా ఈ కరోనా వల్ల ప్రపంచ అభివృద్ధి అనేది అతిపెద్ద సంక్షోభంలో కూరుకు పోయిందంటున్నారు విశ్లేషకులు. మరి దీని నుండి బయటపడే మార్గాలను మేధావులు భూతద్దంపెట్టి వెతకవలసిన అవసరం ఉంది.. లేదంటే కొన్ని దేశాలైతే పూర్తిగా వెనకబడే అవకాశాలు ఉన్నాయట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: