ప్రపంచంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 48 లక్షల 90 వేలకు చేరింది.  3 లక్షల 19 వేల మంది కరోనాకు బలయ్యారు. 17 లక్షల 70 వేల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర దేశం ఈ కరోనా భూతానికి ఘోరంగా బలి అవుతుంది.  ప్రతిరోజూ మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ తర్వాత రష్యా కూడా ఇందులో చేరింది.  ఇక బారత్ లో కూడా కరోనా లక్ష కేసులు నమోదెు అయ్యాయి.  ఇలా ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనాని కట్టడి చేయడాకి లాక్ డౌన్ ఒక్కటే మార్గం అయ్యింది.  మాస్క్ లు తప్పని సరి ధరించాలి. సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. దేశంలో ప్రస్తుతం నాలుగో విడత లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  ఈ లాక్ డౌన్ లో అనేక సడలింపులు ఇచ్చారు.  

 

దాదాపుగా అన్నింటికీ అనుమతి ఇచ్చారు.  మే 31 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి సడలించిన దాని ఫలితాలు మరో 14 రోజుల్లో కనిపించే అవకాశం ఉన్నది.  ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పినట్టుగా జూన్ జులై నెలల్లో ఇండియాలో కరోనా పీక్ స్టేజిలోకి వెళ్తుంది.  ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.  లేదంటే మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.  సాధారణ జన జీవనం మొదలయ్యాక సామాజిక దూరం పాటించాలి అంటే కుదరని పని.  

 

ఎందుకంటే ఒక ఆఫీస్ లో పనిచేసే వ్యక్తులు ఏదొక విషయంలో కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది.  ఆటో, క్యాబులకు కూడా అనుమతి ఇచ్చారు.  ఆటోలో ఇద్దరు ప్రయాణం చెయ్యొచ్చు. ఇద్దరి మాత్రమే అనుమతి ఇచ్చినా... మన దేశంలో అది సాధ్యం అవుతుందా అంటే లేదని చెప్పాలి. దీని ఎఫెక్ట్ తో మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.  జూన్ 1 నుంచి ఇండియాలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: