నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్రలో చంద్ర‌బాబు ఇప్పుడు విల‌విల్లాడున్న‌ట్టుగా గ‌తంలో ఎప్పుడూ ఇన్ని క‌ష్టాలు అయితే ఖ‌చ్చితంగా అనుభ‌వించి ఉండ‌రు. ఓ వైపు ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్ర ముగిసి పోతోంది. మ‌రో వైపు వార‌స‌త్వంపై న‌మ్మ‌కం లేదు.. అస‌లు పార్టీ ఉంటుందా.. లేదా ఎన్టీఆర్ నుంచి తాను బ‌ల‌వంతంగా లాక్కున్న టీడీపీ త‌న క‌ళ్ల ముందే కూలిపోతుందా ? ఇలా ఎన్నో అనుమానాల‌తో ఆయ‌న తీవ్రంగా స‌త‌మ‌త మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం విష‌యంలో ఆయ‌న ఏదో ఒక విమ‌ర్శ చేసుకుంటూ ఆందోళ‌న‌తోనే పొద్దు వెల్ల బుచ్చుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

 

ఇక అటు వైపు చూస్తే రాజ‌కీయంగా చాలా చిన్న‌వాడు త‌న అనుభ‌వంతో పోలిస్తే కేవ‌లం పావు వంతు అనుభ‌వం కూడా లేని జ‌గ‌న్ ఎలాంటి ప‌ద‌వులు లేకుండానే స‌మైక్య రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఓ ఊపు ఊపేశారు. ఇక ఇప్పుడు ఏపీలో చంద్ర‌బాబుతో పాటు టీడీపీ సైకిల్ చ‌క్రాల‌ను తుక్కు తుక్కు కింద విరిచేస్తున్నారు. ఇక జ‌గన్ యేడాది కాలంలోనే త‌న‌ను తాను ఎంతో ఫ్రూవ్ చేసుకున్నారు. ఐదేళ్లు ఆయ‌న సీఎంగా ఉంటే ఇంకెంత ఫ్రూవ్ చేసుకుంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జ‌గ‌న్ అస‌లు సిస‌లైన గేమ్ స్టార్ట్ చేశాడు అనుకుంటున్న టైంలోనే అనుకోకుండా వ‌చ్చిన క‌రోనా దెబ్బ‌తో ప్ర‌తిప‌క్షాల‌కు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.

 

ఇక 2024 ఎన్నిక‌లు ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుకు చివ‌రి ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల్లో అయినా చంద్ర‌బాబు పూర్తి స్థాయిలో రంగంలో ఉంటారా ?  లేదా ? అన్న‌ది చెప్ప‌లేం. అయితే ఆయ‌న‌లో అధికారం ఆశ మాత్రం చావ‌దు. ఇక చంద్రబాబుకు మ‌రో ఛాన్స్ ఇచ్చేందుకు జ‌గ‌న్ రెడీగా ఉండ‌డు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబును సైడ్ చేసేస్తే ఆ త‌ర్వాత జ‌గ‌న్ అధికారం మ‌రో ప‌దేళ్లు అయినా లేదా ప‌దిహేనేళ్లు అయినా కొన‌సాగే ఛాన్స్ ఉంటుంది. ఇంత మంచి అవ‌కాశం జ‌గ‌న్ వ‌దులు కోడు. అందుకే ఇప్ప‌టి నుంచే ఆఖ‌రు ఆట మొద‌లు పెట్టిన జ‌గ‌న్ చంద్ర‌బాబును వీలుంటే మ‌రో యేడాదిలో పూర్తిగా దెబ్బ కొట్టేయాల‌ని... ఆయ‌న‌లో చిన్న ఆశ కూడా లేకుండా చేయాల‌న్న‌ట్టుగానే ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే జ‌గ‌న్ పాల‌న‌లో ఎక్క‌డా లేని దూకుడు క‌న‌ప‌రుస్తున్నారు. ఇక జ‌గ‌న్ దూకుడు, ప‌క్కా ప్లానింగ్‌తో చంద్ర‌బాబు ఆగ‌డం లేదు. ఇక ప‌వ‌న్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: