క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు ముందున్న అతి పెద్ద స‌మ‌స్య‌. మొద‌ట ఈ వైరస్ చైనాలో వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. అప్ప‌టి నుంచి ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ ప్ర‌పంచంపై దండ‌యాత్ర మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే దొరికిన వారిని దొరికిన‌ట్టు చిత్తు చిత్తు చేస్తోంది. క‌రోనా ప్ర‌పంచంపై దాడి చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. దీని ఊపు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక క‌రోనా దెబ్బ‌తో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. భార‌త్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. క‌రోనా ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. 

 

ప్ర‌స్తుతం భార‌త్‌లో నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ భార‌త్‌లో కుప్పలు తెప్పలుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మ‌రియు ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప‌కూలింది. ఈ  ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని దేశాల‌తో పాటు మన దేశం కూడా  తీవ్రంగా కృషి చేస్తుంది. మూడు సార్లు లాక్ డౌన్ పొడిగించుకుంటూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి పీఎం ఇచ్చిన స్పీచ్ లో 'వోకల్ అబౌట్ లోకల్' అనే వ్యాఖ్య చేసారు. దీన్ని బట్టి మనందరం విదేశీ బ్రాండ్స్ ని పక్కన పెట్టి లోకల్ బ్రాండ్స్ ని ఎంకరేజ్ చేయాలి. అయితే దీని మీద ఎక్కువగా ఆలోచించాల్సింది సినీ సెలబ్రిటీలు. 

 

ఎందుకంటే.. మన హీరో హీరోయిన్స్ అందరూ ఎక్కువగా లోక‌ల్ బ్రాండ్స్‌ను ప‌క్క‌న పెట్టి ఫారిన్ బ్రాండ్స్ కి మాత్రమే ఎండార్స్ చేస్తుంటారు. అంతేకాకుండా.. తమ సోషల్ మీడియా నెట్ వర్క్ లలో సైతం విదేశీ కంపెనీ ఉత్పత్తుల గురించి పోస్ట్ చేస్తుండ‌డంతో వారి అభిమానులు ఆ కంపెనీకి చెందిన బ్రాండ్ లను కొనుగులు చేస్తున్నారు. దీంతో ఫారిన్ బ్రాండ్స్ భారీ లాభాల‌ను పొందుతున్నాయి. అయితే మరి ఇప్పుడు ప్రధాని పిలుపుతో అయినా.. సెల‌బ్రెటీలు ఫారిన్ బ్రాండ్స్ కి మాత్రమే ఎండార్స్ చేసే పద్దితికి ఇక స్వస్తి చెప్పి లోకల్ బ్రాండ్స్ కి ప్రమోట్ చేస్తారు..?, మన దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ఎంత‌మంది సెల‌బ్రెటీలు ముందుకు వ‌స్తారు..? అన్న‌ది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: