ఏపీ ప్రజలందరికీ ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్నట్లు గా మారిపోయింది పరిస్థితి. ప్రజలందరూ ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న విషయం తెలిసిందే. ఎక్కడ కరోనా   తమపై దాడి చేసి కాటికి పంపిస్తుందో అనే  భయం తో బిక్కు బిక్కు మంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలందరికీ మరో వైపు నుంచి మృత్యువు దూసుకొచ్చి కబళిస్తోంది. విష వాయువుల రూపంలోనూ ఎంతో మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది

 

 మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన ఘటన ఎంతో నష్టాన్ని కలిగించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఇంకొద్దిసేపట్లో ఉదయిస్తున్న సూర్యుని చూద్దాం అనుకున్న ప్రజలు నిద్రలోనే ప్రాణాలకు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దుస్థితి వచ్చింది. ఎల్జి పాలిమర్స్ అనే కంపెనీ నుండి విషవాయువులు లీకై ఏకంగా కొన్ని గ్రామాల ప్రజలను  అతలాకుతలం చేశాయి అనే విషయం తెలిసిందే. ఈ ఘటనలో మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. 

 

 ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇలాంటి ప్రమాదం మరొకటి జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ కారణంగా అక్కడి ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా భారీ మొత్తంలో గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక గ్రామస్తులందరూ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న రెవెన్యూ పోలీసు యంత్రాంగం బాధితులను వెంటనే వేరే ప్రాంతాలకు తరలించి చర్యలు చేపట్టారు. ఐస్ ఫ్యాక్టరీ లో ఏకంగా నైట్రోజన్  గ్యాస్ లీకేజీ అవడంతో... ఊపిరాడక గ్రామస్తులందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు.ఒక్కసారి గ్యాస్ లీక అవ్వటం తో ప్రజలందరూ భయాందోళనకు గురి చేసారు. ఇంట్లోంచి పరుగులు తీశారు. అధికారులు అక్కడికి చేరుకొని సత్వర చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: