తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ప్రతిపక్షాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా లాక్ డౌన్ 31 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్ తర్వాత తాజా రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు కూడా ఎత్తలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం గురించి మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కి పంచ్ వేశారు గాని, జగన్ ని మాత్రం ఒక్క మాట అనలేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటిలో ఈ ప్రాజెక్టు గురించి ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడలేదు కేవలం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది.

 

కాగా మొట్టమొదటిసారి ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో పోతిరెడ్డి ప్రాజెక్టు నేరుగా స్పందించకపోయినా పరోక్షంగా కేసీఆర్ మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నల సమయం లో కేసీఆర్ స్పందించారు. పోతిరెడ్డిపాడుపై తమ విధానం తమకు ఉందని, అందరిలా తాను యాగీ చేసేవాడిని కాదన్నారు. గతంలో పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే బస్తీమే సవాల్ లాగ వ్యవహరించడంతో ఏమీ సాధించలేకపోయారు అని సెటైర్లు వేశారు. అలాగే సుప్రీం కోర్టు కి వెళ్ళటం ఇలా చేశాడు అంటూ కేసీఆర్ సీరియస్ అయ్యారు.

 

కానీ వైయస్ జగన్ పేరు ఎత్తకుండా చాలా సైలెంట్ గా తన నిర్ణయాన్ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ జగన్ పేరు కేసీఆర్ ఏత్తకపోవటానికి కారణం, ఆయనకీ జాతీయంగా వస్తున్న ప్రశంసలు బట్టి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలనుకుంటున్న తరుణంలో ఖచ్చితంగా జగన్ అవసరం ఉంటుంది కాబట్టి జగన్ తో చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: