లాక్‌డౌన్‌తో ఉన్న ప్రాంతాలను వదిలి.. సొంత గ్రామాలకు వెళ్తోన్న వలస కార్మికులకు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు.. ప్రమాణాలు పోగొట్టుకుంటునే ఉన్నారు.  ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది..వలస కూలీలను తరలిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీ కొట్టడంతో 23 మంది మృతి చెందారు. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్తుండగా, ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రస్తుతం గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  భాగల్‌పూర్‌లోని నౌగచ్చియా వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు - బస్సు ఢీకొనడంతో 9 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ట్రక్కులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   

 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా, మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్ నుంచి జార్ఖండ్‌కు వెళ్తున్న వలస కూలీల బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.  సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

 

వలస కూలీలతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ ఘటన జరిగింది.  ఇలా ప్రతిరోజు వలస కార్మికులను తరలిస్తున్న వాహనాలు తమ గమ్యస్థానం చేరుకుంటాయా లేదా అన్న భయంతో బిక్కు బిక్కుమంటూ ప్రయాణాలు కొనాసాగిస్తున్నారు వసల కూలీలు.  మొన్నటి వరకు ఎక్కడి వారు అక్కడ లాక్ కావడంతో బయటకు వెళ్లలేకపోయారు.  ఈ మద్య కేంద్రం వలస కార్మికులకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: