ప్రస్తుతం ఇండియాలో టిక్ టాక్ ఎంతలా పాపులారిటీ సంపాదించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరిని టిక్ టాక్ మత్తులో ముంచి తేలుస్తోంది. ప్రస్తుతం కేవలం టిక్ టాక్ లోనే గంటలకు గంటలు సమయం గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ టిక్ టాక్ యాప్  కి భారత దేశంలో చాలా మంది యూజర్స్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదాపుగా స్మార్ట్ ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లో టిక్ టాక్ డౌన్లోడ్ చేసి ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు.ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ ఉంది. 

 

 అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్ తో పోరాటం చేస్తుంటే భారతీయ నెటిజన్లు తమ చేతిలో ఉన్న దానితో మరో చిన్న యుద్ధం చేస్తున్నారు. తాజాగా టిక్ టాక్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ గా మారిపోతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టిక్ టాక్ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. 4.7 తో ఉన్న రేటింగ్ ఒక్కసారిగా 2.6 పడిపోయింది. దీంతో టిక్ టాక్ కి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. 

 

 అయితే భారతీయులందరూ వెంటనే టిక్ టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసి దానికి నెగిటివ్ ఇవ్వాలి అని... పూర్తిగా ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయ్యేలా చూడాలి అని ప్రస్తుతం #bantiktokindia అనే హ్యాష్ ట్యాగ్ ట్రేడింగ్ గా  మారిపోయింది. దీంతో ఎంతో మంది నెటిజన్లు ఫోటోలను స్క్రీన్ షాట్ ను పంచుకుంటున్నారు. అయితే టిక్ టాక్ యాప్ కి  నెగిటివ్ రేటింగ్ ఇవ్వడానికి ఎంతోమంది యాప్ డౌన్లోడ్ చేసినట్లు  తెలిపారు. దీంతో కేవలం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే 4.7 రేటింగ్ ఉన్న టిక్ టాక్ 2.6 రేటింగ్ కి  వచ్చింది. కాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: