ప్రస్తుతం వలస కార్మికుల కష్టాలు చూస్తుంటే ఎంతో మంది హృదయాలను ద్రవింపజేస్తున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులు తరలించేందుకు ఎన్ని ఏర్పాట్లు  చేస్తున్నప్పటికీ వలస కార్మికుల కష్టాలు  మాత్రం పూర్తిస్థాయిలో తీరడం లేదు. దీంతో చాలా మంది వలస కార్మికులు నడక ద్వారానే ఇంటికి పయనమవుతున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తూ బతుకు భారమై ఇల్లు దూరమై అష్టకష్టాలు పడుతూ... అడుగు అడుగు ముందుకు వేస్తున్నారు. కాగా వలస కార్మికుల కష్టాల కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం ఎంతో మంది హృదయాలను  కలిసి వస్తున్న విషయం తెలిసిందే. కాలినడకన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతూ... ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు వలస కార్మికులు. 

 


 అయితే తాజాగా వలస కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లి వలస కార్మికుల విషయంలో ఎంతో ఉదారంగా ఉండాలని... ఆర్టీసీ బస్సుల ద్వారా వలస కార్మికులు అందరికీ సరిహద్దులు దాట్టించాలని  అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వలస కార్మికులకు ప్రయాణం నిమిత్తం ఎలాంటి టికెట్ కూడా అడగవద్దని... అంతేకాకుండా నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులు  రోడ్డుమీద ఎక్కడ కనిపించినా వారిని బస్సు ఆపి మరీ ఎక్కించుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. 

 


 అయితే వలస కార్మికులకు కష్టాలు తొలగించి వారికీ చేయూతనిచ్చే  విధంగా ఆర్టీసీ బస్సుల ద్వారా వారిని తరలించాలని నిర్ణయించిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థకు ఏకంగా నిధులను విడుదల చేశారు. కేవలం వలస కార్మికులను  గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు... రైతులను కూడా రైతు బజార్ లకి  ఉచితంగానే ప్రయాణించే సదుపాయాన్ని కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తక్షణమే చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: