ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం వద్దకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం స్పందన అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... తన బలం మొత్తం జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఎస్పీలు అందరూ ఉన్నత సామర్థ్యం ఉన్న వారిగా ప్రభుత్వం గుర్తించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

 


 అందుకే తన పూర్తి నమ్మకం విశ్వాసం వారిపైనే పెడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని కలెక్టర్లు ఎస్పీలు అందరూ సమర్థవంతంగా పనిచేస్తే  ప్రభుత్వ లక్ష్యాలు అన్ని  నెరవేరుతాయని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా  నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఎంతగానో అద్భుతంగా పని చేశారు అంటూ ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... గ్రామ వాలెంటర్ల్లు ఆశా వర్కర్లు డాక్టర్లు కానిస్టేబుల్ మరియు ఇతర కార్మికులు  కూడా ఎంతో అద్భుతంగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు.

 


 అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ నాలుగో విడత లాక్ డౌన్ లో  అడుగుపెట్టారు అంటూ తెలిపిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇంతకుముందు ఉన్న లాక్ లాక్ డౌన్ లీక్ అనుసరించిన పద్ధతి ప్రస్తుతం నాలుగో విడత అనుసరిస్తున్న పద్ధతి పూర్తిగా వేరుగా ఉంటుంది అని చెప్పారు. నాలుగో విడత లాక్ డౌన్ లో  ఆర్థిక వ్యవస్థ పునః  ప్రారంభించాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఓవైపు కరోనా వైరస్ ను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దీనికోసం ఉన్నత అధికారులు అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: