స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కోవిడ్ 19 నివారణ, లాక్ డౌన్ అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై చర్చ, ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పై జిల్లా కలెక్టర్లకు మార్గ నిర్దేశకాలు జారీ చేయనున్నారు. 

 

వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చిన ప్రధాన అంశాలు:

– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్‌
– ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత
– జాతీయ ఉపాధి హామీ పథకం, ఆర్‌బీకేలు, వైయస్సార్‌ గ్రామ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు.
– తాగునీరు. వేసవిలో కార్యాచరణ ప్రణాళిక.
– పాఠశాలల్లో నాడు – నేడు 
– పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
– ఇసుక, మద్యంలో అక్రమాల నివారణ
– జిల్లాకు ముగ్గురు జేసీలు, వారి విధులు

 

నా బలం వీరే.. నమ్మకం, విశ్వాసం :

ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలేనని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలందరూ ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించినట్లు తెలిపారు. తన పూర్తి నమ్మకం, విశ్వాసం వారిపైనే పెట్టానని, అందుకే వారే నా బలమని చెప్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమర్థంగా పని చేస్తే ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్లేనని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించడంలో కలెక్టర్లు, ఎస్పీలు భాగస్వాములు కావాలని సూచించారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన అన్నింటినీ కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాలని ఆదేశించారు.

 

దేశంలోనే అత్యధికంగా 2,48,711 శాంపిళ్లు పరీక్షలు చేశాం,  ప్రతి పదిలక్షల జనాభాకు 4840 మందికి పరీక్షలు చేశాం.  పరీక్షల్లో మనం (ఆంధ్రప్రదేశ్‌) నంబర్‌ ఒన్‌  కరోనా వైరస్‌ నుంచి 1527 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. 705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. (వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు) రాష్ట్రంలో 0.94 శాతం పాజిటివిటీ ఉంది. 3.82 శాతం రికవరీ రేటు ఉంటోంది.. 2.06 శాతం మరణాల రేటు. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే.. మీరు కోవిడ్‌ –19 నివారణలో అద్భుతంగా పని చేశారు. గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎన్‌ంలు, డాక్టర్ల దగ్గర నుంచి, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ అద్భుతంగా పని చేశారని అన్నారు. 

 

రాష్ట్రంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలని సీఎం జగన్ సూచించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా కూడా ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలన్నీ ప్రారంభం అవుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. 

 

రాబోయే రోజుల్లో కూడా మనం కరోనా వైరస్ (కోవిడ్‌–19)తో కలిసి జీవించాల్సి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిని వివక్షతో చూడటాన్ని సమాజం నుంచి తొలగించాలన్నారు. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలని సూచించారు. 

 

 

ప్రభుత్వ కార్యక్రమాలు – క్యాలెండర్‌ :

ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి? తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలి? అన్న ఆలోచనతో ఈ క్యాలెండర్‌ తయారు చేశాం.  కలెక్టర్లు, జేసీలు దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలి అన్నారు. 

మే 22వ తేదీ: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్‌) మొత్తం రూ.905కోట్లలో సగం చెల్లింపు.  మిగిలిన సగం మొత్తం జూన్‌లో చెల్లింపు.  రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఎంఎస్‌ఎంఈలు ఇస్తున్నాయి.  ఆ యూనిట్లు్ల.. వారి కాళ్ల మీద వారు నిలబడాలి:
కరెంటు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చాం. 3 నెలల పాటు ఆ ఛార్జీలు రద్దు అవుతాయి.

 

మే 26వ తేదీ: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్స్, మౌజంలకు రూ.5 వేల చొప్పున ఒన్‌టైం సహాయం.

 

మే 30వ తేదీ:  రైతు భరోసాకేంద్రాలు ప్రారంభం అవుతాయి. గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఇవి మారుస్తాయి. దీని కోసం ఒక జేసీని కూడా పెట్టాం. గ్రామాల్లో ఆర్బీకేలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయి.

జూన్‌ 4వ తేదీ:  వైయస్సార్‌ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, సొంత క్యాబ్‌ ఉన్న వారికి జూన్‌ 4న రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం.

జూన్‌ 10వ తేదీ: జూన్‌ 10 న నాయిబూ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు.. షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఏడాదికి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. ఆమేరకు ఇస్తున్నాం.

జూన్‌  17న మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైయస్సార్‌ నేతన్న నేస్తం ఇస్తాం:
ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ ఇదే తేదీన చెల్లిస్తాం:
మాస్క్‌ల తయారీకి ఆప్కో దగ్గరనుంచి బట్ట తీసుకున్నాం. ఆ బట్టకుసంబంధించిన డబ్బుకూడా వెంటనే చెల్లిస్తున్నాం.

జూన్‌ 24న వైయస్సార్‌ కాపునేస్తం అమలు చేస్తున్నాం:
45–60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి అక్కకూ తోడుగా ఉండేందుకు రూ.15వేలు ఇస్తున్నాం అన్నారు. 

జూన్‌ 29న ఎంఎస్‌ఎంఈలకు సంబధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల :

జులై 1న 104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం.. మొత్తం 1060 కొత్త వాహనాలు ప్రారంభం. ఇవన్నీ ప్రజలకు అందుబాటులో వస్తాయి.

 

జులై 8న వైయస్సార్‌గారి పుట్టినరోజు ఈరోజున ఇళ్లపట్టాలు పంపిణీ  27 లక్షల ఇళ్లపట్టాలు పంపిణీ జులై 29న రైతులకు సంబంధించి వడ్డీలేని రుణాలు.  ఆగస్టు 3వ తారీఖున వైయస్సార్‌ విద్యా కానుక  పిల్లలకు యూనిఫారం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు ఇస్తాం అన్నారు.  ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం నాడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ ఐటీడీఏలున్న కలెక్టర్లు అందరు కూడా దీనిపై దృష్టపెట్టాలి.  ఆగస్టు 12వ తేదీన వైయస్సార్‌ చేయూత ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ అక్కకు 45–60 ఏళ్ల మధ్య ఉన్నవారు రూ.18,750లు ఆరోజు పెట్టబోతున్నాం. ఆగస్టు 19న వైయస్సార్‌ వసతి దీవెన కార్యక్రమం..  ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజనం,లాడ్జింగ్‌ కోసం పిల్లల తల్లులకు రూ.10వేల చొప్పున మొదటి దఫా వసతి దీవెన. 

 

ఆగస్టు 26న హౌసింగ్‌ నిర్మాణం.. 15 లక్షల వైయస్సార్‌ హౌసింగ్‌ శాంక్షన్, ఇళ్ల నిర్మాణం ప్రారంభం. ఎకనామీని ఇది ఓపెన్‌ చేస్తుంది.  సెప్టెంబరు 11న వైయస్సార్‌ ఆసరా ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో అక్కచెల్లె మ్మలకు తోడుగా ఉంటామని చెపాం. మొదటి దఫా సెప్టెంబరు 11న వైయస్సార్‌ ఆసరాకు శ్రీకారం చుడుతున్నాం. సెప్టెంబరు 25న వైయస్సార్‌ విద్యా దీవెన ప్రారంభం.  కాలేజీలకు బకాయిలు లేకుండా ఫీజురియింబర్స్‌ మెంట్‌ ఇచ్చాం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు నేరుగా పిల్లల తల్లుల చేతికే ఇస్తాం అన్నారు.  అక్టోబరులో రైతు భరోసాకు సంబంధించి రెండో విడత ఇస్తాం
ప్రతి కుటుంబానికి రూ.4వేల చొప్పున పంటకోసుకునేందుకు లేదా రబీ అవసరాలకు తేదీ తర్వాత ప్రకటిస్తాం అన్నారు. 

 

అదే అక్టోబరు నెలలో హాకర్స్‌కు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తాం
చిరు వ్యాపారులకు ‘‘జగనన్నతోడు’’ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రూ.10వేల చొప్పున రుణం,రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి మేలు చేకూరుతుంది. నవంబర్‌ నెలలో విద్యా దీవెనకు సంబంధించి రెండో దఫా పిల్లల ఫీజులు నేరుగా తల్లుల  అక్కౌంట్‌కు డిసెంబర్‌మాసంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు సహాయం కలెక్టర్లు, ఎస్సీలు, సీఐడీ విభాగాలు.. కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాలి. జాబితాలను అప్రూవ్‌ చేయించుకోవాలి. ఆ సమయానికల్లా... ఈ పనులు పూర్తికావాలి. జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమం ఉంటుంది. రెండో ఏడాది అమ్మ ఒడి కార్యక్రమం జనవరి 2021 మాసంలోనే రైతు భరోసా చివరి విడత, సంక్రాంతి నాటికి పంటను ఇంటికి తెచ్చుకునే సమయంలో రూ.2వేల రూపాయలు ఫిబ్రవరి 2021లో విద్యాదీవెన మూడో త్రైమాసికానికి సంబంధించి. అలాగే వసతి దీవెన కూడా రెండో దఫా ఇస్తాం 2021 మార్చిలో పొదుపుసంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తాం అన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: