అమెరికన్ ఫెడరల్ కోర్టు తాజాగా పాకిస్థానీ-అమెరికన్ మహిళ జూబియా షహనాజ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఐసిస్‌కు నిధులు ఇచ్చినందుకు ఏకంగా 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్, చైనా, టర్కీ, పలు దేశాలకు సహకరిస్తూ ఉండటం... అలాంటి సంస్థకు మహిళ నిధులు ఇవ్వడంతో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. డిస్ట్రిక్ట్ జడ్జి జొఅన్నా సీబెర్ట్ ఈ తీర్పు చెప్పగా స్థానిక ప్రజల నుంచి ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తమవుతోంది. 
 
2018 నవంబరులో జూబియా షహనాజ్ నేరం చేసినట్లు అంగీకరించారు. విదేశీ ఉగ్రవాద సంస్థకు తాను మెటీరియల్ సపోర్ట్ చేసినట్లు ఆమె పోలీసులకు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్-షామ్ ఉగ్రవాద సంస్థకు 1,50,000 డాలర్ల నిధులు ఇచ్చినట్టు ఆమె అంగీకరించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
 
మహిళ ఉగ్రవాద సంస్థకు నిధులు ఇవ్వడం కోసం అనేక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ను విచారణలో తేలింది. అనేక క్రెడిట్ కార్డులను ఉపయోగించి మహిళ నిధులు అందజేసినట్లు న్యాయశాఖ పేర్కొంది. పాకిస్థాన్, చైనా, టర్కీలలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అనుబంధ సంస్థలకు ఆమె సహకరించడంపై 1,50,000 డాలర్లకు పైగా నిధులు ఇవ్వడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
2017 జూలై 31న న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐసిస్‌కు నిధులు ఇచ్చిందనే ఆరోపణలతో మహిళను అరెస్ట్ చేశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్ళేందుకు జూబియా షహనాజ్‌‌ ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె అరెస్ట్ జరిగింది. పాశ్చాత్య దేశాల నుంచి వెళ్లేవారంతా సిరియాలోని ఐసిస్‌లో చేరేందుకు మొదట టర్కీలోని ఇస్తాంబుల్‌కు వెళ్తారు.                               

మరింత సమాచారం తెలుసుకోండి: