మనం ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం.. చిన్నతనంలో తప్పిపోయి.. పెద్దయ్యాక తల్లిదండ్రులను హీరో కలుస్తాడు.    తాజాగా ఇలాంటి సంఘటన ఓ చైనా దంపతుల జీవితంలో జరిగింది.  ఎప్పుడో 2 ఏళ్ళ వయస్సులో తప్పిపోయిన వాళ్ళ కొడుకు 32 ఏళ్ళ తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఆ తలిదండ్రుల ఆనందానికి అవదులేకుండా పోయింది. ఇక అసలు విషయానికి వస్తే..  షాంగ్జీ ప్రావిన్స్‌లో గ్జియాన్‌లో 1988లో రెండేళ్ల మావో ఇన్‌ కిడ్నాప్ కు గురయ్యాడు. అప్పటి నుంచి మావో కోసం అతడి‌ తల్లిదం‍డ్రులు వెతుకుతూనే ఉన్నారు. తెలిసిన ప్రతి చోట వెతి వెతికి విసిగిపోయారు.   అలాగే మావో పోలీకలకు దగ్గరగా ఉండి, అదే సమయంలో కిడ్నాప్ కు గురైన దాదాపు 300 మందిని కలుసుకున్నారు. వారిలో ఎవ్వరి డీఎన్‌ఏ మావో తల్లిదండ్రులతో మ్యాచ్ కాలేదు. ఇక తమ కుమారుడు రాడన్న నిరాశ మిగిలిపోయింది.

 

కిడ్నాప్ కు గురైన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా సహాయపడాలని మావో తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అందుకు అనుగుణంగా 2007లో ‘బేబీ కమ్‌ బ్యాక్‌ హోమ్‌’ పేరుతో వాలింటరీ గ్రూపును ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 29 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరేలా లీ జింగ్జీ కృషి చేశారు. గత ఏప్రిల్‌లో సిచువాన్‌ ప్రావిన్సులో ఓ వ్యక్తి నుంచి తమకు మావో గురించి సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

 

ఏళ్ల కిందట తాము బాలుడిని దత్తత తీసుకున్నామని సదరు వ్యక్తి తెలిపాడు.  34 ఏళ్ల మావో ఇన్‌ని గుర్తించి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. అప్పటికే తమ వద్ద ఉన్న లీ జింగ్జీ డీఎన్‌ఏతో మావో ఇన్‌ డీఎన్‌ఏ మ్యాచ్‌ అయింది. ఆ చిన్నారిని చిన్నతనంలో  దుండగులు  పిల్లలు లేని తల్లిదం‍డ్రులకి రూ. 60వేలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. మావో ను వెతికి పెట్టిన పోలీసులకు లీ జింగ్జీ కృతఙ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: