రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో లాక్ డౌన్ అమలవుతూ ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గినా... ఆటంకాలు ఎదురవుతున్నా జగన్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
కానీ సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయి. తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించింది. ఏదైనా పని కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడుంది అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులు ఇతర అవసరాల కోసం వినియోగిస్తే ఉన్నతాధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. 
 
ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనుల బకాయిలు చెల్లించకుండా ఇతర అవసరాలకు నిధులు మళ్లించడంపై జగన్ సర్కార్ విస్మయం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ అఫడవిట్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. హైకోర్టు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. కోర్టు తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. 
 
కేంద్రం ఏపీ సర్కార్ కు నిధులు విడుదల చేస్తే కేంద్రం ఏపీ ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు వాడుకుందనే ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక పథకం నిధులు మరొక పథకానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. జగన్ సర్కార్ కు ఈ పిటిషన్ అతి పెద్ద పరీక్ష అనే చెప్పవచ్చు. ఈ పరీక్షలో జగన్ పాస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: