పాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్... సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారు. ఇప్పటికే వివిధ పథకాలు ప్రకటించిన సీఎం జగన్.. మరిన్ని పథకాల అమలుకు సంబంధించి  స్పష్టత ఇచ్చారు. అధికారుల సహకారంతో సంక్షేమ పథకాలను చక్కగా అమలు చేయగలుగుతున్నామని జగన్ ప్రశంసించారు. కలెక్టర్లతో సీఎం జగన్ .. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

ఏపీ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసింది. డిసెంబర్ నెల వరకూ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి.. క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. MSMEలకు సంబంధించిన 905 కోట్ల రూపాయల ఇన్సెంటివ్‌ బకాయిల్లో..సగం.. ఈనెల 22న చెల్లిస్తామన్నారు ఏపీసీఎం జగన్. మిగిలిన సగం జూన్ లో చెల్లిస్తామన్నారు..26న అర్చకులు, ఫాస్టర్లు, ఇమామ్ లకు.. ఐదువేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు. 30న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 4న వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా .. సొంత ఆటో, క్యాబ్ ఉన్నవారికి పదివేల  రూపాయల ఆర్థికసాయమందిస్తామన్నారు.  జూన్ పదిన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు పదివేల రూపాయల సాయం చేయనున్నట్లు చెప్పారు.జూన్ 17న వైఎస్సార్ నేతన్న, జూన్ 24న వైఎస్సార్ కాపునేస్తం ప్రథకాల ద్వారా లబ్ధిదారులకు సాయమందిస్తామన్నారు. జూన్ 29న ఎంఎస్ఎంఈ రెండో విడత 450 కోట్లు విడుదల చేస్తామన్నారు. జూలై ఒకటిన వెయ్యి 60 కోట్ల రూపాయల విలువైన కొత్తవాహనాలతో.... 104,108 అంబులెన్స్ సేవలు ప్రారంభిస్తామన్నారు. 

 

జూలై8న వైఎస్సార్ జయంతిరోజు ... 27 లక్షలమందికి ఇళ్లపట్టాల పంపిణీ చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్.  జూలై 29న రైతులకు వడ్డీ లేని రుణాలందిస్తామన్నారు. ఆగస్టు 3న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ROFR పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత, ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన పథకం., ఆగస్టు 26న 15 లక్షల  వైఎస్సార్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. సెప్టెంబర్ పదకొండున వైఎస్సార్ ఆసరాకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 25న వైఎస్సార్ విద్యాదీవెన  పథకం ప్రారంభిస్తామన్నారు.  అక్టోబర్ నెలలో చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద.... పదివేల రూపాయల చొప్పున సాయమందిస్తామన్నారు.. డిసెంబర్ నెలలో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం చేస్తామన్నారు సీఎం జగన్. కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: