జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు పోరాటాలు మీద పోరాటాలు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అన్నా క్యాంటీన్లు, ఇసుక, అమరావతి ఇలా వరుస పెట్టి వైసీపీ ప్రభుత్వంపై నిరసనగా పలు దీక్షలు చేశారు. కానీ అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆఖరికి జనం పవన్ చేసిన ర్యాలీలని అయిన పట్టించుకున్నారు గానీ.. బాబు దీక్షలని పట్టించుకోలేదు.

 

ఇక కరోనా ప్రభావం మొదలయ్యాక బాబు హైదరబాద్ లో సెటిల్ అయ్యి, అక్కడ నుంచి జగన్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తమ నేతల చేత పలు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని, ఇళ్లలోనే ఉంటూ దీక్షలు చేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. 3, 4 రెట్లు విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామని బాబు ఫైర్ అయిపోయారు.

 

అయితే మామూలుగానే ప్రజలు బాబు దీక్షలని పట్టించుకోరు, ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటూ దీక్షలు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందో తెలియడం లేదు. దాని వల్ల ప్రజలకు ఏం ఒరగదు కూడా. కానీ ఇప్పటికే కరెంట్ బిల్లులు ఎక్కువ రావడంపై వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని అందుకే బిల్లులు కాస్త అధికంగా వస్తున్నాయని, అంతే తప్ప తమ ప్రభుత్వం కరెంట్ బిల్ పెంచలేదని వివరణ ఇచ్చారు.

 

కానీ బాబు మాత్రం దీనిపై ఏకంగా దీక్ష చేయడానికి రెడీ అయిపోయారు. అయితే బాబు దీక్ష కంటే బీజేపీ నేతలు దీక్షలకు దిగారు. అందులో భాగంగానే బాబు మాజీ అనుచరుడు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కూడా విద్యుత్‌ బిల్లుల పెంపునకు నిరసనగా దీక్ష చేశారు. మరి చూడాలి బాబు ఈ విద్యుత్ దీక్ష ఎంతవరకు సక్సెస్ అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: