పోతిరెడ్డిపాడుపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కోల్డ్ వార్ మొదలైందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా కేసీఆర్ మీడియా సమావేశం పరిశీలిస్తే సీఎం జగన్‌తో పెద్దగా విభేదాలు లేవన్నట్లే మాట్లాడారు. అలా అని పోతిరెడ్డిపాడు విషయం మాత్రం వదలమని చెబుతున్నారు. ఇక కొందరు గిట్టని వాళ్ళు కావాలని వివాదం సృష్టిస్తున్నారని, గత ఏపీ ప్రభుత్వం ప్రతిదానికి లడాయి పెట్టుకుందని దాని వల్ల ఏమి ఒరిగిందని అంటూ చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక బాబ్లీ ప్రాజెక్టు గురించి పొరాడి ఏం సాధించారని అడిగారు.

 

ఈ విధంగా కేసీఆర్ పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజ్ పై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. అదొక బోగస్ అని మండిపడ్డారు. అయితే ఇక్కడ మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు కేసీఆర్ పై మండిపడుతున్నారు. కేసీఆర్ అవగాహన లేక, మతిలేక, కొంచెం చుక్క ఎక్కువై మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని చెబుతూ కేసీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు.

 

అయితే బీజేపీ నేతలు కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చినా, టీడీపీ నేతలు మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నారు. అసలు ఒక్క టీడీపీ నేత కూడా ఆ విమర్శలపై స్పందించిన దాఖలాలు లేవు. గతంలో అధికారంలో ఉన్నప్పుడూ మాత్రం ప్రతిదానికి కేసీఆర్‌తో కయ్యం పెట్టుకునే వారు. కానీ ఓడిపోయాక మాత్రం బాబుతో పాటు టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. టీడీపీ వాళ్ళు కేవలం జగన్ ప్రభుత్వంపైనే విరుచుకుపడుతున్నారు తప్ప, కేసీఆర్ జోలికి అసలు వెళ్ళడం లేదు.

 

మరి కేసీఆర్‌ని టార్గెట్ చేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ, బాబు బ్యాచ్ మాత్రం కేసీఆర్ కు కౌంటర్ మాత్రం ఇవ్వడం లేదు. పైగా కేసీఆర్ పై పొరాడి జగన్ నీళ్ళు ఎలా తెస్తారో చూస్తామని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: