షాహిద్ ఆఫ్రిది... ఇతను ఒక పాకిస్తాన్ మాజీ క్రికెటర్... ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతున్న మాజీ క్రికెటర్.. కొన్నిసార్లు అందరం కలిసి ఫ్రీగా క్రికెట్ ఆడుకుందామా అంటూ వ్యాఖ్యలు చేస్తుంటాడు.. మరికొన్నిసార్లు పాకిస్తాన్ మా భూభాగమే అంటూ వివాదం సృష్టిస్తాడు.. మరికొన్నిసార్లు నరేంద్ర మోడీ విధానాలను తప్పు పడుతూ విమర్శల పాలవుతూ  ఉంటాడు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు షాహిద్ ఆఫ్రిది. వాస్తవంగా అయితే షాహిద్ ఆఫ్రిది ని పాక్ సైన్యం వెనుక నుండి నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 ఎందుకంటే ఎవరు ఎక్కువగా భారతదేశం పై విమర్శలు చేస్తే వారికి సైన్యం సప్పోర్ట్ ఉంటుంది.  వారిని పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి ఇష్టపడుతుంది పాక్ . దీంతో ప్రస్తుతం షాహిద్ ఆఫ్రిది ని తమ నాయకుడిగా మార్చుకున్నారు.. ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దింపాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు . ఇదిలా ఉంటే షాహిద్ ఆఫ్రిది  భారత పై  వివాదాస్పద వ్యాఖ్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయన్న  విషయం తెలిసిందే. అయితే ఒక క్రికెట్ ఆటగాడు విమర్శలు చేసినప్పుడు ఇక్కడి నుంచి కూడా క్రికెట్ ఆటగాడు విమర్శలు చేస్తే బాగుంటుంది. ఈ నేపథ్యంలోనే కపిల్దేవ్,  గౌతం గంభీర్ లాంటి వాళ్ళు ఏకంగా  అభివృద్ధి వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఎన్నో కౌంటర్లు వార్నింగ్ లు  కూడా ఇచ్చారు. 

 


 అయినప్పటికీ షాహిద్ ఆఫ్రిది తీరులో మాత్రం అసలు మార్పు రాలేదు. ఇంకా  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ షాహిద్ ఆఫ్రిది  వ్యాఖ్యలను ఖండిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మీరు ఎంత చించుకున్నా కాశ్మీర్ భూభాగం మాదే .. మీరు ఏం చేసినా అది మాకే చెందుతుంది.... మా  జోలికి రాకండి అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఎంతోమంది వార్ణింగ్ లు  ఇచ్చినప్పటికీ షాహిద్ అఫ్రిది లో  మార్పు రాలేదు. ఇక ఇప్పుడు శిఖర్ ధావన్ వార్నింగ్ ఇచ్చిన ఇంకా భారత్ ను తిట్టడం  ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే భారత్ ని ఎంత ఎక్కువ తిడితే  పాకిస్తాన్ లో అంత సపోర్ట్ లభిస్తుంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: