కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన దాని పై సీఎం కేసీఆర్ సెటైర్లు వేయడం జరిగింది. అది ఒక భోగస్  ప్యాకేజ్ అని దారుణంగా కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. సోమవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ చాలా దారుణంగా కేంద్ర ప్రభుత్వాన్ని కరోనా భారీ ప్యాకేజ్ విషయంలో విమర్శలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా కౌంటర్లు వేశారు. కేసిఆర్ వాడిన భాష నేను మాట్లాడలేను అని చెప్పుకొచ్చారు. అటువంటి భాష తనకు రాదని అంత శక్తి తన దగ్గర లేదని పేర్కొన్నారు.

 

కేంద్రం ప్రకటించిన కరోనా  భారీ ప్యాకేజీ పై కేసిఆర్ బోగస్ అంటూ మాట్లాడిన పదాలను కిషన్ రెడ్డి ఖండించారు. ఇలాంటి భాష తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా వాడారని  అని అన్నారు. ఇటువంటి కీలకమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని భారీ ప్యాకేజీ ప్రకటించిందని అన్నారు. ఈ సమయంలో సంతోషించాలి గాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. ప్రధాని తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వివరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు వేయాలని అలాంటి వారికే 'రైతుబంధు పథకాన్ని' అమలు చేస్తామని కేసీఆర్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామా అని ఆయన ప్రశ్నించారు.

 

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై అడ్రస్ లేని అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ చేసిన విమర్శలు తప్పుబట్టారు. మరి ఇదే సమయంలో అప్పట్లో కరోనా వైరస్ కట్టడి చేయడంలో మోడీ తీరు అద్భుతమని పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ పత్రికలు, అంతర్జాతీయ సమాజం ప్రశంసించిన విషయాలు కేసిఆర్ కి గుర్తులేవా అన్ని కిషన్ రెడ్డి అన్నారు. ఇంకా పలు విషయాలలో కేసిఆర్ పై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు కిషన్ రెడ్డి

 

మరింత సమాచారం తెలుసుకోండి: