జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై సంక్షేమ పథకాలతో వరాల జల్లు కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మేనిఫెస్టో లో ఉన్న ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా పరిపాలన అందిస్తున్నారు. ఎక్కడా కూడా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా జగన్ తన టీం తో ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం అయ్యేలా ముందుచూపుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ పోతున్నారు. పరిపాలన పరంగా ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నా వాటిని ఎదుర్కొంటూనే మరోపక్క ప్రజలకు అదిరిపోయే సంక్షేమ పరిపాలన ఇస్తున్నారు. జగన్ ఏడాది పరిపాలనలో అంతా బాగానే ఉన్న తాజాగా మాత్రం జగన్ సర్కార్ నీ అతి పెద్ద అంశం ఒక్కటి ఇబ్బంది పెడుతుంది. అది ఏమిటంటే మత్తు డాక్టర్ సుధాకర్ విషయం.

 

కరోనా వైరస్ సమయంలో నర్సీపట్నం మత్తు డాక్టర్ గా వ్యవహరించిన డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం డాక్టర్ కి మాస్కులు ఇవ్వటం లేదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అనుభవం లేని వైద్యుల చేత రోగులకు చికిత్స చేయిస్తుందని ఆరోపించారు. అప్పట్లో డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉందో, లేదో తేల్చాలని ఏపీ ప్రభుత్వం విచారణ చేసి తేలికగా ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలటంతో సస్పెండ్ అయ్యారు. ఇదిలావుంటే ఇటీవల డాక్టర్ సుధాకర్ నడిరోడ్డుపై పోలీసులపై మరియు జగన్ నీ బండ బూతులు తిట్టారు.

 

అదే సమయంలో కొన్ని వర్గాల ప్రజలను టెర్రరిస్టులు అని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు చాలా దురుసుగా డాక్టర్ సుధాకర్ ని దాడి చేసినట్లు కాళ్లు చేతులు కట్టేసి రోడ్డు మీద పడుకోబెట్టినట్లు దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో డాక్టర్ సుధాకర్ దళితుడు కావడంతో వైసీపీకి అండగా ఉండే దళిత ఓటు బ్యాంకు ఇప్పుడు పోతుందేమో అని వైసీపీ నేతలు డైలమాలో పడినట్లు వార్తలు వినపడుతున్నాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో అత్యుత్సాహంగా వ్యవహరించడం జరిగిందేమో అని వైసిపి నాయకులు డైలమాలో పడినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మద్యం మత్తులో ఉన్నాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్న ప్రభుత్వమే ఆయనని పోలీసుల చేత అరెస్టు చేయించడం పట్ల దళితులో  విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: