పాకిస్థాన్ కి ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికైన నాటినుండి భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో కాశ్మీర్ ప్రాంతంలోకి ఉగ్రవాదుల చొరబడి ఎక్కువైంది. కరోనా వైరస్ రాకముందు చాలాసార్లు పాకిస్తాన్ ప్రాంతం నుండి ఉగ్రవాదులు కాశ్మీర్ లో కి రావటానికి ట్రై చేయటంతో భారత బలగాలు దాడులకు పాల్పడటం తో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక కాశ్మీర్ విషయంలో చాలా నిక్కచ్చిగా ముందుకు వెళ్లడం జరిగింది. ఆర్టికల్ 370 తీసుకురావడంతో కాశ్మీర్ పై పూర్తి పట్టు సాధించింది భారత్. దీంతో అప్పటి నుండి పాకిస్తాన్ దేశం నుండి ఉగ్రవాదులు భయంకరంగా భారతదేశంలోకి చొరబడని కాశ్మీర్ అంశం ద్వారా దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పాలని ట్రై చేస్తూనే ఉన్నారు.

 

ఇటీవల ఒకపక్క దేశమంతా కరోనా వైరస్ ద్వారా  లాక్ డౌన్  అయిన సమయంలో  సరిహద్దుల గుండా  ఉగ్రవాదులు దేశంలో రావాలని ప్రయత్నాలు చేయడం జరిగింది.  ఇదిలా ఉంటే  కాశ్మీర్ పై ఉగ్రవాద సంస్థ తాలిబన్  కీలక వ్యాఖ్యలు చేసింది.  కాశ్మీర్ ఎప్పటికీ ఇండియా దే అని తేల్చి చెప్పిన తాలిబన్.. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోము అని చెప్పింది. కాశ్మీర్ లో పాక్ చర్యలపై స్పందిస్తూ జిహాదీ పేరిట ఆ దేశం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్దతు ఇస్తామని వస్తున్న వార్తలను ఖండించింది. 

 

అలాగే కాశ్మీర్ సమస్య  పరిష్కారం అయ్యే అంతవరకు  తన గ్రూపు కి మరియు ఇండియా కంట్రీ కి ఎటువంటి సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాలిబన్ ప్రకటన విడుదల చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ..  సుహైల్ షాహీన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసాడు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని తాము ఇప్పటివరకు అలాంటి ప్రకటనలేమి చేయలేదని స్పష్టం చేశారు. తాము దేశాల అంతర్గత విధానాల్లో జోక్యం చేసుకోరాదని నిబంధన పెట్టుకున్నామని తాలిబన్ లీడర్ సుహైల్ షాహీన్ స్వష్టం  చేశారు. ఎలాగైనా కాశ్మీర్ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఉగ్రవాదులు వేస్తున్నా ప్లాన్ లను ఖండిస్తున్నారు తాలిబాన్ సంస్థకు చెందిన నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: