పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద దుమారాన్ని రేపుతోంది. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఆంధ్ర తెలంగాణ అధికార పార్టీల నాయకులు ఈ ప్రాజెక్టు విషయంలో ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎవరు కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం 203 జీవో జారీ చేయడాన్ని తీవ్రస్థాయిలో తప్పు పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కృష్ణా ట్రిబ్యునల్ కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం శాఖ అయ్యేవిధంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సరికొత్త వాదనతో జగన్ సర్కార్ రెడీ అయింది.

 

అదేమిటంటే తాము కొత్తగా చేపట్టబోయే ఎత్తిపోతల పథకం వలన ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదని తెలిపింది. అంతేకాకుండా శ్రీశైలం రిజర్వాయర్ తో దిగువ స్థాయి నుంచి నీటిని తీసుకునేలా తెలంగాణ ప్రాజెక్టులు ఉండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి నీరు అందటం కష్టంగా మారిందని పేర్కొంది. అందువల్లనే ఈ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలపాలని ఏపీ ప్రభుత్వం వాదించడానికి రెడీ అయ్యింది. ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన పొలమూరు, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న విషయాన్ని తెరపైకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం రెడీ అయింది.

 

విభజన చట్టం ప్రకారం బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా తెలంగాణ సర్కార్ అవి పట్టించుకోలేదని న్యాయస్థానం దృష్టికి జగన్ సర్కార్ కి తీసుకు వచ్చింది. మొత్తంమీద చూసుకుంటే గత ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో కేసిఆర్ తెలంగాణలో ఇష్టమొచ్చినట్లు ప్రాజెక్టులు కట్టడం జరిగింది. వాటికి అనుమతులు కూడా లేకుండా ఉన్నాగాని చంద్రబాబు ఏమి ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ విషయాన్ని న్యాయస్థానాలు ముందు తీసుకు రావటం తో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సంచలనంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: