ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వీరి స్నేహపూర్వక సంబంధాలు చూసి ప్రతిపక్షాలు కూడా ఓర్వలేని పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. పోతిరెడ్డిపాడు జల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు కేసీఆర్ సమయం చూసి దెబ్బ కొట్టాడని స్నేహపూర్వకంగా మెలుగుతూనే మోసం చేశారు అంటూ ఆరోపణలు చేయడంపై విమర్శలు చేయడం పెరిగిపోయింది. 

 


 ఇలాంటి నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంతో వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల  మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి మాట్లాడారు. మేము మేము బాగానే ఉన్నాము అని..మా  మధ్య స్నేహపూర్వక బంధాన్ని చూసి ఓర్వలేని వారే ఇలా ఏదో ఒక రాద్దాంతం చేస్తున్నారని కేసిఆర్ వ్యాఖ్యానించారు. అయితే కెసిఆర్ ఇలా పోతిరెడ్డిపాడు నీటి వివాదం విషయంలో ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారు అనే దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్న  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే కేసీఆర్ పోతిరెడ్డిపాడు నీటి విషయంలో ఎలాంటి సమస్య లేదు. 

 


 ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ తమకు హక్కు ఉన్న దానికంటే ఎక్కువ నీటిని వాడుకుంటాం అని చెప్పడం లేదు. తమకు హక్కు ఉన్న మేరకు మాత్రమే తమ నీళ్లు తాము  వాడుకుంటామని చెబుతున్నారు. అంటే పోతిరెడ్డిపాడు నీటి విషయంలో కేసీఆర్ కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో రెడ్డి కమ్యూనిటీ ఓట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. గతంలో కూడా జగన్ కు సపోర్ట్ చేయటంతో కాంగ్రెసు పార్టీకి సపోర్ట్ చేసే రెడ్డి కమ్యూనిటీ తమ  వైపు తిప్పుకున్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. ప్రస్తుతం జగన్ తో  బంధం ఉంటే  వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెడ్డి కమ్యూనిటీ ఓటు మళ్ళీ టిఆర్ఎస్ వైపు వచ్చే  అవకాశం ఉంది కాబట్టి  వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: