ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి చర్యలు అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక విధానం పై మరియు వ్యవసాయ రంగంపై ఈ సమావేశంలో మంత్రులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ వ్యవసాయ శాఖ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రైతులకు సలహాలు ఇచ్చే విధంగా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన విధానం చూసి చాలా మంది రైతులు ఇది సలహా ఇచ్చేలా లేదు వార్నింగ్ ఇచ్చినట్లు నియంతృత్వ పోకడలతో మాట్లాడినట్లు ఉంది అని అంటున్నారు.

 

ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే రైతులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని తెలిపారు. ప్రభుత్వా సూచనలకు అనుగుణంగా రైతులు వ్యవసాయం చేస్తే లాభాలు పొందుతారు అని  పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన సమగ్ర వ్యవసాయ విధానం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ఎక్కడ ఎటువంటి పంటలు వేయాలి అన్నది ప్రభుత్వమే మ్యాపింగ్ చేస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం దేశానికి అన్నం పెట్టే స్థాయికి అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా రైతులంతా ప్రభుత్వానికి కృషి చేయాలని అన్నారు.

 

అంతేకాకుండా తెలంగాణలో ఉన్న నేల నల్లరేగడి ఎర్ర రేగడి క్షార తెల్ల నేలలు రాష్ట్రంలో ఉన్నాయని మనది సమశీతోష్ణ మండలం అని ఏడాదిలో సగటున 900 మి.మీ వర్షపాతం ఉంటుందని ఎలాంటి వరదలు తుఫానులు మరియు ప్రకృతి విపత్తు వంటివి తక్కువగా సంభవిస్తాయని వివరించారు. అంతేకాకుండా సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఎకరాల చొప్పున 2604 క్లస్టర్స్ను ఏర్పాటుచేశామని కేసీఆర్ తెలిపారు. ఏ ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి అనేది మొత్తం ప్రభుత్వం చెబుతోందని రైతులు సహకరించాలని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం సూచించిన విధానంగా పంటలు వేసినవారికే 'రైతు భీమా పథకం' వర్తిస్తున్నట్లు కేసిఆర్ చెప్పడాన్ని పూర్తిగా  తప్పుపడుతున్నారు. ఇది సలహాలు ఇచ్చినట్టు లేదు నియంతలా కేసిఆర్ రైతులపై పెత్తనం చెల్లిస్తున్నట్లు ఉందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: