ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలాగే కొనసాగుతుంది. దేశంలోని సినిమా షూటింగ్ లూ  నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ మొదలు కానీ లేదా కొంతమేర షూటింగ్ పూర్తయిన  సినిమాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అన్ని పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా నిర్మాతల పరిస్థితి అయితే ప్రస్తుతం కష్టాల కడలిల తయారయ్యింది . సినిమా నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ప్రస్తుతం సినిమా విడుదల అయితేనే వస్తాయి కానీ థియేటర్లు కాస్త మూతపడడంతో... నిర్మాతలు కొన్ని రోజులు అయోమయంలో పడినప్పటికీ ప్రస్తుతం అందరూ ఒక తాటి పైకి వస్తూ తమ  సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటిటి ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు. 

 

 ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమా నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ప్రముఖ ఓటిటి  కంపెనీల ద్వారా విడుదల చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అటు తమిళంలో కూడా స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాను ఓటిటి  ద్వారా విడుదల చేయాలని సూర్య నిర్ణయించారు . అయితే తన సినిమా ఓటిటి  ద్వారా విడుదల చేయ కూడదు అని సూర్యాకు ఫైనాన్షియర్ల నుండి వార్నింగులు కూడా వచ్చాయి. 

 


 అయితే ఇలా చాలామంది హీరోలకు ఇప్పటివరకు వార్ణింగ్ లూ  వచ్చినప్పటికీ అందరూ పోనీలే మనకెందుకు అని  వదులుకున్నారూ. సూర్య మాత్రం ధైర్యం చేసి తన సినిమాను ఓటిటి  విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. అదేసమయంలో తనకు వార్నింగ్ ఇచ్చిన ఫైనాన్సియర్లకు  ఎదురు తిరగడం కూడా మొదలు పెట్టాడు సూర్య. సూర్య కు మద్దతుగా ఏకంగా 40 మంది నిర్మాతలు మద్దతుగా కూడా నిర్మించారు. అయితే తనకు బెదిరింపులకు గురి చేసిన వారికి ఏకంగా డైరెక్టుగా ఒక ప్రశ్న అడిగారు సూర్య. ప్రస్తుతం తనకు 70 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని... వాటిని మీరు తీరుస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే భవిష్యత్తులో సూర్యకు  చెక్ పెట్టేందుకు అందరూ సిద్దమాయ్యే అవకాశం ఉంది. మరి అప్పుడు ఇండస్ట్రీ మొత్తం సూర్య కు మద్దతు గా ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: