చంద్రబాబు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఒకరిని బుక్ చేయడమే తప్ప తాన్ బుక్కవడం ఎరగని నేత. ఎపుడో, ఎక్కడో లెక్కలు తప్పితేనే ఆయన అలా ఇరకాటంలో పడతారు. ఇపుడు మాత్రం బాబు ని బుక్ చేసింది రాజకీయ ప్రత్యర్ధులు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది జరిగే పని కాదు కాబట్టి.

 

బాబుని బుక్ చేసింది కరోనా వైరస్. దాని ఫలితంగా వచ్చిన లాక్ డౌన్. లాక్ డౌన్ ఇపుడు చంద్రబాబుని పూర్తిగా పొలిటికల్ లాక్ చేసేలా ఉంది. చంద్రబాబు అడుగు తీసి బయటకు పెట్టడం జరిగేలా కనిపించడంలేదు. నాలుగవ విడత లాక్ డౌన్ ఏపీలో జరుగుతోంది.  ఈ లాక్ డౌన్ లో కూడా కరోనా వైరస్ ముప్పుని హెచ్చరిస్తూ వయో వ్రుధ్ధులు ఎవరూ కూడా బయటకు రాకూడదని స్పష్టంగా చెప్పారు.

 

కరోనా మహమ్మారితో 65 ఏళ్ళు వయసు పైబడిన వారికి హై రిస్క్ ఉంటుందని అంటున్నారు. అందువల్ల వారు అత్యవసరంగా బయటకు రావాలంటే కూడా ఇబ్బందులే. అయితే బాబు వీవీఐపీ. పైగా సీనియర్ పొలిటీషియ‌న్. ఆయన ఏపీకి రావాలనుకుంటే మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి.

 

ఇక వయసు మీద పడిన వారు  బయట  ఎక్కువగా తిరగకూడదని కూడదని నిబంధనలు ఉన్నాయి. అందువల్ల బాబు ఇప్పట్లో ఏపీకి వచ్చే అవకాశం లేదు. వచ్చినా కూడా ఆయన మునుపటిలా బయట తిరగలేరు. ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి ఇది దెబ్బే. సీనియర్ నేతలు నాయకత్వం వహిస్తున్న పార్టీలు దేశంలో ఎన్నో ఉన్నా కూడా ఇలా ఏకైక నాయకుడిగా ఉండే పార్టీలు టీడీపీ తప్ప వేరోకటి లేవు.

 

దాంతో ఇపుడు చంద్రబాబు ఇబ్బంది మొత్తం తెలుగుదేశం ఇబ్బంది అవుతోంది.  దాంతో చూడాలి బాబు ఎలా ఈ లాక్ డౌన్ పరిణామాలను దాటుకుని మళ్ళీ పూర్వంలా బయట తిరుగుతారో. ఏది ఏమైనా తెలుగుదేశంలో రెండవ తరం నాయకత్వం అవసరాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.మరి లోకేష్ ఈ సమయంలో యాక్టివ్ అవుతారా.

మరింత సమాచారం తెలుసుకోండి: