ఇటీవల ఓ సంస్థ కరోనా వైరస్ భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది అన్నా ఈ విషయంపై అధ్యయనం నిర్వహించింది. కరోనా వైరస్ వల్ల మార్చి నెలాఖరు నుండి దేశంలో ఇటీవల కొన్ని రోజుల ముందు వరకు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగలేదు. ఈ సమయంలో ఎవరికి వారు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనటం జరిగింది. అయితే కరోనా వైరస్ దెబ్బకి దేశంలో రాబోయే రోజుల్లో 13.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఈ సంస్థ సర్వేలో తేలింది. ఈ పరిణామంతో 7.6 శాతంగా ఉన్న దేశంలో ఉన్న నిరుద్యోగత 35 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ తెలిపింది. మొత్తంమీద చూసుకుంటే 17.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని వచ్చిన సర్వేల లెక్కలు బయటపడ్డాయి.

 

ఈ ప్రభావం ప్రజల జీవితాలపై ఆర్థిక విధానాల గట్టిగా చూపుతోందని తెలిపింది. ఈ కారణంతో 12 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోతారని వారిలో నాలుగు కోట్ల మంది అత్యంత దీన స్థితిని ఎదుర్కొనే పరిస్థితి ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారత ఆర్థిక వ్యవస్థ లాక్ డౌన్ వలన ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మేరకు నష్టపోయే ప్రమాదం ఉందని దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టకపోతే మరింత ప్రమాదంలో భారత ఆర్థిక వ్యవస్థ పడే అవకాశం ఉందని తెలిపింది.

 

1981-82 లో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దిశగా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వెళ్తున్నట్లు ఆర్థర్ డీ లిటిల్ సంస్థ అంచనా వేసింది. ఇదే సమయంలో ఇటీవల కరోనా వైరస్ భారీ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని సమర్థించింది ఈ సంస్థ. 'మేకిన్ ఇండియా' నినాదంతో ప్రస్తుతం పాలకులు అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటే త్వరలోనే ఈ సంక్షోభం భారతీయులు అధిగమించగలరు అని ఆర్థర్ డీ లిటిల్ సంస్థ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: