పోతిరెడ్డిపాడు జల వివాదం.. కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయితీలకు కారణమైంది. రాయలసీమకు నీటి కోసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచే విషయంపై మాటల యుద్ధం మొదలైంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతోనే రాయలసీమకు నీటి కష్టాలు పోతాయని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. కెపాసిటీ పెంచేందుకు ఈ మేరకు జీవో ఇచ్చేశారు.

 

 

అయితే.. మాకు చెప్పకుండా ఈ జీవో ఎలా ఇచ్చారని కేసీఆర్ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ కృష్ణాబోర్డుకు కంప్లయింట్ కూడా ఇచ్చింది. దీనిపై ఏపీ అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు. అయితే.. అటు కేసీఆర్ కానీ.. ఇటు జగన్ కానీ ఈ విబేధాలపై నేరుగా స్పందించలేదు. సోమవారం కేసీఆర్ ప్రెస్ మీట్లో ఈ అంశంపై స్పందిస్తూ.. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు.

 

 

అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఏపీ సర్కారు జీవో విడుదల చేసిందట. ఈ ఆరోపణ చేస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.. ఈ ముఖ్యమంత్రులు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారని, ఆ భేటీలోని వాస్తవాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది మనం చెప్పలేం. దీనిపై అటు కేసీఆర్.. ఇటు జగన్ కానీ స్పందించాల్సిందే.

 

 

అయితే రేవంత్ రెడ్డి మాత్రం.. 2005లోనే పోతిరెడ్డిపాడు సామర్ద్యం పెంపునకు ఆదేశాలు వచ్చాయని అప్పుడు 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని అంటున్నారు. అప్పుడు కేంద్ర కార్మిక మంత్రిగా కెసిఆర్ ఉన్నారని, తెలంగాణ ప్రక్రియ ఆలస్యం అవుతోందని అప్పట్లో ఆయన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు. రాజీనామా చేసిన అనంతరం కేసీఆర్ పోతిరెడ్డిపాడుపై ప్రస్తావన కూడా తేలేదని.. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ హయాంలో తాను పోరాడినట్లు కెసిఆర్ చెబుతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: