తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గతంలో ఎన్నడూ లేనంత స్ట్రాంగ్ గా ఉంది. ప్రతిపక్షాలన్నీ చాలా వీక్ గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోనికి ఎవరైనా జంప్ చేస్తారా.. అంటే అబ్బే అలాంటి సీన్ ఉండదని ఎవరైనా చెబుతారు. కానీ ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారట.?

 

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భయపెట్టో, బతిమాలో ఈ ఫిరాయింపులకు కారణం అవుతుందనుకుంటే పొరపాటే.. వాళ్లంతా వెళ్లేది కాంగ్రెస్ లోనికట. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికవబోతున్నారని ప్రచారం జరుగుతున్న భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. అందుకు ఆయన ఓ కండిషన్ పెడుతున్నారు. అదేంటంటే.. తనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే... దాదాపు 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారట.

 

 

కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. తాను పిసిసి అద్యక్షుడు అయితే టిఆర్ఎస్ కు చెందిన ఏభై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని.. తెలంగాణ లో కాంగ్రెస్ బలోపేతానికి అన్ని రకాలుగా పాటుపడతానని ఆయన ఆ ఇంటర్వ్యూలో అన్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెడితే.. పాదయాత్రలు, బస్ యాత్రలు వంటివాటిని చేపట్టి ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని కోమటిరెడ్డి అంటున్నారు.

 

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం తమ లక్ష్యమని కోమటిరెడ్డి అంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళతామని ఆయన అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పై ప్రజలకు మొహం మొత్తితే ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. కొన్నాళ్లుగా తెలంగాణ పీసీపీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని విజయంవైపు నడిపించడంలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికవైపు కాంగ్రెస్ హైకమాండ్ కొన్నాళ్లుగా దృష్టిసారించింది. కానీ కోమటిరెడ్డి పగ్గాలు చేపట్టగానే పోలో మంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ లో చేరిపోతారా..ఇది మరీ టూమచ్ గా అనిపించడం లేదూ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: