ప్రస్తుత పరిస్దితుల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో చాల మంది స్వేచ్చగా తిరుగుతున్నారు.. పార్టీలకు హాజరవుతున్నారు.. అసలు కరోనా అనే రోగం తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.. కానీ ముందు పోంచి ఉన్న ముప్పును గ్రహించడం లేదు.. ఇక అధికారులు ఎన్ని రోజులని జాగ్రతగా మసలుకోండని చెబుతారు.. అందుకే కరోనా వైరస్ ఉన్నన్ని రోజులు ఎలా బ్రతకాలో కొన్ని మార్గదర్శకాలను సూచించారు.. అందులో ఒకటి మాస్క్ లేకుండా బయట తిరగడం అనేది చాలా ప్రమాదకరమైన చర్య.. ఇప్పటికే చాలమంది మాస్క్‌లు ధరించకుండానే బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒకవేళ మాస్క్‌ లేకపోతే ఫైన్‌ వేస్తారని తెలిసినా లైట్‌ తీసుకుంటున్నారు. వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు..

 

 

ప్రభుత్వానికి కూడా చెప్పి చెప్పి ఓపిక నశించినట్లు ఉంది.. అందుకే ఈ నేపధ్యంలో లాభం లేదనుకున్న పోలీసులు... మాస్క్‌ ధరించని వారికి వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అలా ఇప్పటి వరకు తెలంగాణలో 16వేల 264 మందికి ఫైన్‌ వేశారు. ఇకపోతే ఈ కేసులు ఎక్కువగా తెలంగాణలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయట. దీంతో ప్రభుత్వం వైరస్‌ కట్టడికి జీహెచ్‌ఎంసీపై ఫోకస్‌ పెట్టింది. కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే... మాస్క్‌ను తప్పనిసరి చేసింది. మాస్క్‌ లేకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తుంది..

 

 

ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రజలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నారట.. కాగా ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 3వేల 892 మందికి ఫైన్‌ వేయగా, తర్వాత స్థానంలో వరంగల్‌ నిలిచింది. వరంగల్‌లో 1846 మందికి జరిమానా విధించారు. ఇక అత్యల్పంగా వనపర్తి జిల్లాలో కేవలం నలుగురికే ఫైన్‌ వేశారు. ఇక ప్రజలంతా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ముఖానికి మాస్క్ లేకుండా బయట తిరగవద్దు.. దీని వల్ల రెండు విధాల నష్టం.. అదేమంటే ఒకటి కరోనా వచ్చే అవకాశం, రెండవది.. జేబులకు బొక్క.. ఇదంతా మీరు ఆరోగ్యంగా జీవించడం కోసమే అని గమనించగలరని పేర్కొంటున్నారు అధికారులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: