ఏపీలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మరియు జగన్ మొదటి నుండి చాలా స్నేహపూరితంగా మెలుగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఇద్దరు సామరస్య వాతావరణంలో సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకముందు నుండి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా జగన్ కి కేసీఆర్ పరోక్షంగా మద్దతు తెలుపుతూ వచ్చారు. ఎన్నికల సమయంలో కూడా జగన్ కి కాస్త అండగా నిలబడటం జరిగింది. ఇటువంటి సమయంలో కృష్ణాజలాల వివాదం ఇద్దరి మధ్య దూరం పెంచినట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో గోదావరి మిగులు జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించాలని వాడుకోవచ్చని గతంలో తాను చెప్పినట్లు ఒప్పుకున్న కేసీఆర్, కానీ జగన్ కృష్ణా జలాల విషయంలో చాలా దురుసుగా వ్యవహరించడం తగదని సుతిమెత్తగా కామెంట్లు చేశారు.

 

కృష్ణా జలాల విషయంలో తన ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న కామెంట్లు తిప్పికొడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆ తర్వాత మిగతావి అని  కేసీఆర్ మొన్న అనడం జరిగింది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ తో కయ్యానికి సిద్ధం అన్నట్టుగా సన్నద్ధం అవ్వటం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో కృష్ణ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లెటర్ రాయడం జరిగింది. దీంతో ఈ లెటర్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెటర్ లో ఏపీ ప్రభుత్వం కొన్ని సందేహాలు లేవనెత్తింది. అదేమిటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ కాకతీయ, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులతో పాటు, సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ ఎల్ బి సి వంటి ప్రాజెక్టుల పైన ఫిర్యాదు చేసింది.

 

ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై కృష్ణ బోర్డ్ స్పందించి దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. కేసిఆర్ విభజన చట్టానికి విరుద్ధంగా ఈ ప్రాజెక్టుల్లో వ్యవహరించినట్లు రూల్స్ పాటించకుండా ప్రాజెక్ట్స్ కట్టడంతో జగన్ ఈ విధంగా స్పందించినట్లు సమాచారం. ఇష్టానుసారంగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచి విభజన చట్టానికి విరుద్ధంగా కేసిఆర్ వ్యవహరించడంతో న్యాయం తన వైపు న్యాయం ఉందన్న ధీమాతో జగన్ కృష్ణాజలాల బోర్డు కి లెటర్ రాసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. సామరస్య వాతావరణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చూస్తున్నా కేసిఆర్ కి జగన్ దూకుడు ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టించిన టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: