మహమ్మారి కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా లో పుట్టిన ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవటంతో వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం లాక్ డౌన్ విధిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. అయితే ఈ సమయంలో చాలావరకు దేశాలలో ఆర్థిక నష్టం రావడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం  ఏర్పడింది. మరోపక్క శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం రాత్రింబవళ్లు తెగ కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో చాలా దేశాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ నీ ఎత్తివేసి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తున్నయి. ఈ సందర్భంగా బయటకు వచ్చే ప్రజలంతా ముఖానికి మాస్క్ తప్పనిసరి అని చెబుతూ భౌతిక దూరం కనీసం ఆరడుగులు ఉండాలని ఆదేశాలిస్తూ ప్రజలను దేశ నాయకులూ బయటకు వదులుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో కరోనా భౌతిక దూరం ఈ విషయంలో మరో భారీ కొత్త కోణం గురించి శాస్త్రవేత్తలు తాజా పరిశోధన బట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే కరోనా వైరస్ ఆరడుగుల వ్యాప్తిలో కాదు 18 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు తాజా పరిశోధనలో గుర్తించారు. క‌రోనా సోకిన వ్య‌క్తి నుంచి వెలువ‌డే తుంప‌ర‌లు గాలిలో ఆవిరై 18 అడుగుల దూరం వ‌ర‌కు వ్యాప్తి చెందుతాయ‌ని సైంటిస్టులు తేల్చారు.

 

సైప్ర‌స్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ నికోసియా ప‌రిశోధ‌కులు గాలిలో క‌రోనా గ‌రిష్టంగా ఎంత దూరం వ‌ర‌కు వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యంపై ప‌రిశోధ‌న చేశారు. అందుకు గాను వారు కంప్యూట‌ర్ సిములేట‌ర్‌ను ఉప‌యోగించారు. క‌రోనా సోకిన వ్య‌క్తి నుంచి వెలువ‌డే తుంప‌ర‌లు గాలిలో ఆవిరై అవి 18 అడుగుల దూరం వ‌ర‌కు వ్యాప్తి చెందుతాయ‌ని గుర్తించారు. కేవలం 5 సెకండ్లలో వ్యాపిస్తుందని ఈ పరిశోధనలో సైంటిస్ట్ గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: