ఈ మద్య మన సమాజంలో ఓ అమ్మాయి పుట్టిందంటే వెంటనే పెదవి విరుస్తున్నారు.. అయ్యో మొదటి కాన్పు అమ్మాయా? అబ్బాయి పుడితే వంశోద్దారకుడు అవుతాడు అన్న మాటలు వినిపిస్తాయి.  కానీ ఇప్పుడు అమ్మాయిలు అన్నింటా అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు.  వలస కార్మికులు తమ స్వస్థలాలకు ఎన్నో కష్టాలు పడుతూ వస్తున్నారు. ఇప్పుడు అందరూ ఔరా అనిపించేలా ఓ ఆడకూతురు తన తండ్రి కోసం పడ్డ కష్టం చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ కరోనా మహమ్మారి చేయడం వల్ల రెక్కడితేగాని డొక్కాడని జనం చరిత్ర ఎరగని చరిత్రలు సృష్టిస్తున్నారు. ఎవరూ పట్టించుకోపోయినా, గుర్తించకపోయినా, పిడికెడు సాయం చేయకపోయినా తన బతుకుభారాన్ని తామే మోస్తూ ఆత్మగౌరవంతో సగర్వంగా నిలబడుతున్నారు. గాయపడిన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఓ బాలిక ఏకంగా 1200 కి.మీ తొక్కి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది.

 

 బిహార్‌లోని దర్భంగాకు చెందిన మోహన్ పాశ్వాన్ ఢిల్లీల కూలినాలి చేసుకుంటున్నాడు. రిక్షాను కిరాయికి తీసుకుని తొక్కేవాడు. అయితే లాక్ డౌన్ వల్ల రిక్షా కిరాయి రాకపోవడంతో ఆ యజమాని రిక్షాల లాగేసుకున్నాడు. ఇంటి కిరాయి కూడా చెల్లించకపోవడంతో యజమాని బెదిరింపులకు దిగాడు. ఇదే సమయంలో అతను గాయపడటంతో ఆ కుటుంబ పరిస్థితి మరింత కష్టంలో పడింది.  ఆ సమయంలో వారి దగ్గర వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి.. అందులో రూ.500 సైకిల్ కొని ఆ అమ్మాయి తండ్రికి దైర్యం చెప్పి తమ సొంత ఊరు గురుగ్రామ్ పోదామని చెప్పింది.  

 

ఇక ఈ నెల 10న ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి మహాప్రయాణం మొదలైంది. దారిలో అష్టకష్టాలు పడుతూ నిన్న దర్భంగా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇద్దరికీ కరోనా టెస్ట్ చేయగా, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇద్దర్నీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ అమ్మాయి మాట్లాడుతూ.. మాకు కష్టాలు ఉన్నాయి.. ఇప్పుడు ధైర్యం చేయకుంటే మరింత కష్టం ఎదురౌతుంది. పెట్రోల్ బంగ్ లో పడుకుని ఉదయం సైకిల్ తొక్కేదాన్ని.. సహాయ శిబిరాల్లో మాకు ఆహారం అందించారు అని జ్యోతి చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: