తెలంగాణ రాజకీయాలలో మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం తో గెలిచే స్థానాలలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. అనవసరంగా తెలంగాణ ముందస్తు ఎన్నికల టైంలో టిడిపితో పొత్తు పెట్టుకోవడం జరిగింది అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫలితాలు వచ్చిన తర్వాత లబోదిబోమన్నారు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి గురించి సీనియర్ నాయకులలో పోటీ నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనదేనని త్వరలో అధ్యక్ష స్థానంలో తాను కూర్చో బోతున్నట్లు ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ లో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తాను పిసిసి అధ్యక్షుడి పదవి లో కూర్చున్న మరుక్షణం కేసిఆర్ ప్రభుత్వం కూలిపోయే విధంగా ప్లాన్ వేసినట్లు ఆయన సరికొత్త వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఇంగ్లీష్ ఛానల్ లో ఇంకా మాట్లాడుతూ తాను పిసిసి అధ్యక్షుడిని అయితే టిఆర్ఎస్ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరటానికి రెడీగా ఉన్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేపట్టి నిత్యం ప్రజల్లోనే ఉండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

 

గత సార్వత్రిక ఎన్నికల టైంలో కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా గెలవలేని స్థితిలోకి దిగజారింది. ఇటువంటి సమయంలో కోమటిరెడ్డి పీసీసీ పదవి అధిరోహిస్తే టిఆర్ఎస్ పార్టీ కూలిపోతుందని చెప్పటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడం అసంభవమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: