లాక్ డౌన్ వలన అనేక అవస్థలు పడుతున్న వలస కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా సదుపాయాలు కల్పించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీల కోసం 75 శ్రామిక ట్రైన్ లో దాదాపు లక్ష మందిని స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కి 6 కోట్లు చెల్లించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కూలీల నుండి ఒక్క పైసా కూడా వసూలు చేయలేదని అన్నారు. అదే విధంగా మంచినీరు, భోజనానికి కూడా వారి దగ్గర నుండి ఎటువంటి చార్జీలు వసూలు చేయలేదని కేటీఆర్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం పాత్ర సున్నా అని స్పష్టం చేశారు.

 

ఇటీవల వలస కూలీల విషయంలో మోడీ సర్కార్ ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రకటిస్తున్న ప్రకటనలు వాస్తవానికి వచ్చేసరికి జీరో అన్నట్టుగా కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో చిక్కుకుపోయిన మేఘాలయ ప్రజలను తిరిగి అక్కడికి తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సంగ్మా కర్నాడ్ ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మే 21 వ తారీఖున మేఘాలయా కు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేక రైలు సర్వీసు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

 

మొత్తంమీద చూసుకుంటే వలస కూలీలు తరలించే విషయంలో మోడీ సర్కార్ ప్రకటనలకే తప్ప వాస్తవానికి వచ్చేసరికి ఏమీ చేయటం లేదు అన్నట్టుగా కేటీఆర్ పరోక్షంగా తెలిపారు. ఇదే సమయంలో సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఇటీవల మృతి చెందిన బండలింగంపల్లి కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన టు సోషల్ మీడియాలో కేటీఆర్ వెల్లడించారు. వచ్చేది వానాకాలం కాబట్టి వ్యవసాయం ఈ విషయంలో అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించినట్లు కేటీఆర్ సోషల్ మీడియాలో తెలిపారు. మొత్తం మీద జాతీయస్థాయిలో మోడీ సర్కార్ ప్రకటనల ప్రభుత్వం అని..పనుల సర్కార్ కాదని కేటీఆర్ మోడీకి వ్యతిరేకంగా సరికొత్త గళం తో తెలంగాణ సర్కార్ సిద్ధమైనట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: