కరోనా వైరస్ విషయంలో మొదటి నుంచి వస్తున్న తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో విమర్శలు ఎదుర్కుంటూ వస్తోంది. తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా చేసి చూపించేందుకే, అంతగా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఎదుర్కొంటూనే ఉంది. దీని పై సీఎం కేసీఆర్ , కేటీఆర్ స్పందించారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఏమైనా అవార్డులు ఇస్తారా అంటూ మొన్నటి వరకు ఎదురు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం పై కొద్ది రోజులుగా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ లేఖ రాశారు. అలాగే కరోనా పరీక్షలు చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 


ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆమె లేఖ రాశారు. తెలంగాణలో పరీక్షలు తక్కువగా చేస్తున్నా, కేసుల సంఖ్య  ఎక్కువగా ఉండటాన్ని లేఖలో ఆమె ప్రస్తావించారు. కరోనా వైరస్ మనల్ని వేటాడడానికి ముందు మనమే కరోనా వైరస్ ను అంతమొందించాలి అంటూ ఆమె వ్యాఖ్యానించారు.  తక్షణమే కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించి ఈ వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కరోనా పరీక్షల్లో తెలంగాణ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే ఉండడాన్ని లేఖలు ఎత్తిచూపారు. దేశంలో సగటున చేస్తున్న పరీక్షల్లో పాజిటివ్ కేసులు శాతం 4.12 గా ఉండగా, తెలంగాణలో మాత్రం పాజిటివ్ రేటు 5.26 శాతంగా ఉందని లేఖలో ఆమె ప్రస్తావించారు.

 


 అలాగే తెలంగాణలో కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్ లను వాడుకోకపోవడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణలోనూ పరీక్షలను నిర్వహించాలని చూస్తోంది. తెలంగాణ లో రెండు రోజులుగా కొత్త కేసులు పెరుతుండడంపైనా ఆందోళనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: