కరోనా వైరస్ ఇండియాలో ఎంటర్ అయినా నాటినుండి కేంద్రం లాక్ డౌన్ ఇప్పటివరకు నాలుగు సార్లు పొడిగిస్తూ వచ్చింది. అయినా కానీ దేశంలో ఎక్కడా కూడా వైరస్ కంట్రోల్ అయిన సందర్భాలు లేవు. మార్చి నెలాఖరు నుండి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలులోకి తీసుకు వచ్చిన పాజిటివ్ కేసులు గాని, మరణాలు గాని ఎక్కడా తగ్గలేదు. పైగా ఉన్న కొద్దీ ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో వైరస్ విస్తరిస్తూనే ఉంది తప్ప అదుపులోకి వచ్చిన దాఖలాలు కనబడటం లేదు. ఇటువంటి సమయంలో ఒకపక్క దేశంలో ఆర్థిక రంగం కుదేలు అవుతున్న తరుణంలో నాలుగో దశ లాక్ డౌన్ పొడిగించిన సందర్భంలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు ఇస్తూ ఆంక్షలు తొలగిస్తూ కేంద్రం సరికొత్త సడలింపులు జారీ చేయడం జరిగింది.

 


ఈ సందర్భంగా రైల్వే మరియు అంతర్ రాష్ట్ర రవాణా కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ మే 31 వరకు కొనసాగుతుందని కేంద్రం చెప్పుకొచ్చింది. పెంచిన ప్రతిసారీ పరిస్థితి వైరస్ కంట్రోల్ లో అవడంలేదని, విజృంభిస్తున్నే ఉందని కేంద్రం అంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ మే 31 తర్వాత ముగియనున్న తరుణంలో.. నెక్స్ట్ జూన్ అనగా వర్షాకాలం వైరస్ మరీ దారుణంగా భయంకరంగా విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వైరస్ ఇండియాలో విస్తరించిందని అది ఇంకా తీవ్రరూపం దాల్చలేదని జూన్ మాసంలో దాని విశ్వరూపం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

 


ఖచ్చితంగా వచ్చే జూన్ మాసం నుండి కరోనా వైరస్ ప్రపంచంలో ఏ దేశంలో విస్తరించిన విధంగా ఇండియాలో విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు ప్రస్తుత తీవ్రత బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మళ్లీ ఇండియా దేశంలో  'టోటల్ లాక్ డౌన్' అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయ స్థాయిలో కూడా వాదన వినబడుతోంది. ఈ లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పరిస్థితి అధిగమించే అవకాశం ఉందని మరి కొంతమంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: