భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ ని హతమార్చిన నాథూరామ్ గాడ్సే గురించి మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ పోస్ట్ చేయగా... ప్రస్తుతం ఆ ట్వీట్ అనేక వివాదాలకు తెర లేపుతోంది. నాగబాబు 19వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలోని ఒక పోస్టులో ఈ విధంగా పేర్కొన్నాడు... 'ఈ రోజు నాథూరామ్ గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాథూరామ్ గాడ్సే దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది. పాపం నాధురాం గాడ్సే...' అంటూ నాథూరామ్ గాడ్సే ఆత్మ శాంతించాలని కోరుకున్నాడు. 


దీంతో మహాత్మా గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశ భక్తుడు అని అనడం సరికాదని చాలా మంది కాంగ్రెస్ నేతలు నాగబాబు పై మండిపడ్డారు. సినిమా డైలాగులు బయట చెప్పకు అని వి. హనుమంతరావు నాగబాబు కి కౌంటర్ ఇచ్చారు. తన అన్నయ్య చిరంజీవి గాంధీ గురించి ఎంత చక్కగా సినిమా తీసాడు కాని నాగబాబు మాత్రం ఆర్ఎస్ఎస్ ట్రాప్ లో పడి ఆ భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి నాగబాబు ప్రయత్నిస్తున్నాడు అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమంది నాగబాబు గాడ్సే దేశభక్తి గురించి చెప్పింది నిజమేనని అతడి వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. 


ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో... "కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్ ''నాకు కూడా''..( మంచి బుద్ధుని ప్రసాదించమని) ''అని'' గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా", అని తన నాగబాబు ట్వీట్ కి రిప్లై గా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. అన్నయ్య చిరంజీవి తో ఫ్రెండ్షిప్ చేస్తున్న విజయశాంతి తమ్ముడు నాగబాబుకి సపోర్ట్ చేయకుండా శత్రువుగా మారిందేంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


ఇకపోతే నాగబాబు ట్వీట్ చేసిన అనంతరం అనేక విమర్శలు వెల్లువెత్తడంతో తను మళ్ళీ మరొక ట్రీట్ చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. "దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్ల కన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం', అని మహాత్మా గాంధీ గురించి తాను తప్పుగా ఏ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: